తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఇదే. చాలా కాలం తరువాత సమంత తెలుగు సినిమాలో నటించబోతుందనే వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో సమంత అసలు తెలుగు సినిమాలనే పట్టించుకోలేదు అన్న కామెంట్స్ వినిపించాయి. దీంతో ఆమె అభిమానులు సైతం డీప్ గా హర్ట్ అయ్యారు. అయితే అలాంటి వాళ్లని కుషి చేసే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.


వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “మురుగన్” అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా ఒక తారక్ నటించనుండగా, సమంత జోడీగా రావడం ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్‌గా మారింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ సినిమాకు సమంతను తీసుకోవాలని త్రివిక్రమ్ చాలా రోజుల కిందటే నిర్ణయించుకున్నారట.  గతంలో ఓ ఈవెంట్‌లో సమంతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఆయన ఈసారి ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మరియు సమంత కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించాయి.ఇప్పుడూ అదే కాంబో మళ్లీ కలవబోతుండటంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కథ, స్క్రీన్‌ప్లే, త్రివిక్రమ్ డైలాగ్స్ అన్నీ కలిస్తే మళ్లీ ఒక క్లాసిక్ ఎంటర్‌టైనర్ పుట్టుకతీసుకుంటుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది.



సమంత విషయానికొస్తే, కొంతకాలంగా బాలీవుడ్ మరియు పాన్‌ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె, తిరిగి టాలీవుడ్‌లో అడుగుపెడుతుండటమే పెద్ద వార్తగా మారింది. ఇటీవలే ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో సినిమాలపై తిరిగి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆమెకు మళ్లీ తెలుగు ప్రేక్షకుల్లో తన స్థానాన్ని మరింత బలపరచే అవకాశం కల్పించనుంది.ఇక ఈ “మురుగన్” సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోందని టాక్. సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం కానుందని సమాచారం.అన్నీ అనుకున్నట్టు జరిగితే — త్రివిక్రమ్, సమంత కాంబో మళ్లీ టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ రికార్డ్ సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: