పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఉగాది కానుక సందర్భంగా మార్చి 19న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమా అంచనాలను పెంచేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు అలాగే హీరోయిన్ శ్రీ లీల, రాశి ఖన్నా నటిస్తున్నారు.



భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది. పవన్ కళ్యాణ్ కూడా తాజాగా డబ్బింగ్ పనులను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండడంతో అభిమానులలో కూడా ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తోంది. అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గడిచిన పదేళ్ల క్రితమే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నుంచి పవన్ కళ్యాణ్ రూ .5 కోట్ల రూపాయల వరకు అడ్వాన్స్ తీసుకున్నట్లు టాకు వినిపిస్తోంది.


వివిధ కారణాలవల్ల సినిమా ఆలస్యం అయ్యిందని, తాను రాజకీయాలలో బిజీగా ఉండడం చేత చాలాసార్లు వాయిదా కూడా పడిందనే విషయాన్ని గ్రహించిన పవన్ కళ్యాణ్సినిమా కోసం రూ .25 కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం ఉండడంతో  లాభాలలో వాటాలో కొంత భాగం ఇచ్చేలా నిర్మాతలతో డీల్ కుదురుచుకున్నట్లు  ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.ఇటివలె మేకర్స్ ట్రైలర్ పేరుతో ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేయగా రెస్పాన్స్ అదిరిపోయింది. మరి ట్రైలర్ తో ఎలాంటి అంచనాలు పెంచేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: