టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ తలపతి ఎట్టకేలకు గత కొద్ది రోజులుగా తన మీద వస్తున్న వార్తల పైన స్పందించారు. విజయ్ నుంచి ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే.వివాహమైన 26 ఏళ్ల తర్వాత విజయ్ నుంచి విడాకులు కోరడమనేది తమిళనాడు రాజకీయాలలోనే సంచలనంగా మారింది. అంతేకాకుండా ఆమె చెప్పిన కారణాలు కూడా సరికొత్త అనుమానాలకు దారితీసింది. కొన్నేళ్లుగా వేరే హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నారని అందుకే ఆయన నుంచి విడాకులు కావాలంటూ ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. అంతేకాకుండా సంగీతకి రూ .250 కోట్ల భరణం ఆఫర్ ఇచ్చారనే విధంగా కూడా వార్తల వినిపించాయి.


దీంతో ఆ హీరోయిన్ ఎవరంటూ అభిమానులు తెగ సర్చింగ్ చేయగా త్రిష, విజయ్ మధ్య ఏదో నడుస్తోందని త్వరలోనే వాళ్ళు వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో సంగీత చెప్పిన హీరోయిన్ త్రిష నే అంటూ వార్తలు కూడా వైరల్ గా మారాయి. అయితే ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చేలా  ఇటీవలే ఒక ప్రముఖ నిర్మాత ఇంట్లో వివాహం జరుగుతూ ఉండగా అక్కడికి విజయ్, త్రిష ఒకే కారులో నుంచి దిగి వివాహానికి వెళ్లగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.


ఎట్టకేలకు విజయ్ మాట్లాడుతూ.. ఈమధ్య చాలా వివాదాలు తనమీద వస్తూ ఉన్నాయి, ఈ విషయంలో మీరు నాకు మద్దతుగా నిలవాలని మీరు కూడా ఆ వార్తల వల్ల బాధపడుతున్నారని నాకు తెలుసు, మీరు బాధపడడం చూస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధగా ఉంది అవి నా వ్యక్తిగత సమస్యలు వాటిని నేనే చూసుకుంటాను మీరు వాటి గురించి అసలు పట్టించుకోవద్దు ఇప్పుడు మనం అందరం కలిసి ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలంటూ తెలియజేశారు. దీంతో విజయ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: