2026 టీ20 వరల్డ్ కప్ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. మార్చి 8న (ఈరోజు) ఫైనల్ మ్యాచ్ ఇండియా జట్టుతో న్యూజిలాండ్ జట్టు తలపడడానికి సిద్ధమయ్యింది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కేవలం ట్రోఫీ మాత్రమే కాదు కొన్ని కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ కూడా లభించబోతోంది. అందుకు సంబంధించి న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది.


ఫైనల్ కి చేరిన అటు ఇండియా, న్యూజిలాండ్ జట్లకు కాసుల వర్షమే కురిసేలా కనిపిస్తోంది.. ఈ టోర్నీ కోసం ఐసీసీ మొత్తం రూ .120 కోట్ల రూపాయల వరకు కేటాయించింది. అయితే ఇందులో గెలిచిన టీమ్ కి రూ.27.48 కోట్ల రూపాయలు, రన్నర్ టీమ్ కి రూ.14.65 కోట్ల రూపాయల వరకు అందుతాయి. అలాగే సెమీస్లో ఓడిన టీమ్ కి రూ.7.24 కోట్ల రూపాయలు చొప్పున లభిస్తాయి. అలాగే సూపర్ 8 వరకు వచ్చిన జట్లకు రూ.3.48 కోట్ల రూపాయల వరకు వస్తాయి అలాగే టి 20 లో పాల్గొన్న టీమ్స్ కు రూ.2.29 కోట్ల రూపాయల వరకు ఇవ్వనుంది.

 

 2024 భారత్ టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బీసీసీఐ ప్రత్యేకించి మరి రూ.125 కోట్ల రూపాయల బహుమతిని కూడా ప్రకటించారు. మరి 2026లో కూడా ఇండియా టీమ్ టైటిల్ గెలిస్తే బీసీసీఐ నుంచి మరో భారీ రివార్డు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ నాల్గవసారి ఆడే తొలి జట్టుగా ఇండియా ఉంటుంది. ఒకవేళ గెలిస్తే రెండవసారి టైటిల్ గెలిచే తొలి జట్టు కూడా కావచ్చు. అలాగే కెప్టెన్ సూర్యకుమార్ కూడా గెలుపోటములతో సంబంధం లేకుండా  రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. సూర్య ఫామ్ తగ్గడం వయసు(35 ) వల్ల కెరియర్ చివరి దశలో ఉన్నందుకు రిటైర్మెంట్ ఇవ్వడానికి ఇదే సరైన సమయం భావించినట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: