టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి రవితేజ తాజాగా మాస్ జాతర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ని నవంబర్ 1 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను అక్టోబర్ 31 వ తేదీన సాయంత్రం నుండే ప్రదర్శించారు. ఈ సినిమాకు ప్రీమియర్ షో ల ద్వారానే నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక అక్టోబర్ 31 వ తేదీన ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రూపొందిన బాహుబలి ది బిగినింగ్ , బాహుబలి ది కంక్లూజన్ అనే సినిమాల నుండి కొన్ని సన్నివేశాలను కలిపి బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో విడుదల చేశారు. ఇక బాహుబలి ది ఎపిక్ మూవీ ని భారీ ఎత్తున విడుదల చేయడం , అలాగే మాస్ జాతర మూవీ కి కూడా నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు పెద్ద ఎత్తున కలెక్షన్లు రావడం లేదు అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు మాస్ జాతర మూవీ కి సంబంధించిన ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

5 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3.40 కోట్ల కలెక్షన్లు  దక్కగా , సీడెడ్ లో 1.34 కోట్లు , ఆంధ్ర లో 3.61 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 9.47 కోట్ల షేర్ ... 17.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 5 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 65 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్ సిస్ లో 47 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 5 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 9.47 కోట్ల షేర్ ... 17.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 20 కోట్ల టార్గెట్తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో 10.53 కోట్ల షేర్ కలెక్షన్లు వసూలు చేసినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్టుగా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt