టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సంగీత దర్శకులలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. ఈయన సంగీతం అందించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. కొన్ని సందర్భాలలో ఈయన సంగీతం తోనే సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే దేవి శ్రీ ప్రసాద్ కి ఒక సంవత్సరం మాత్రం అద్భుతమైన రీతిలో కలిసి వచ్చింది. ఈయన ఒక సంవత్సరం సంగీతం అందించిన ఐదు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

అలాగే ఈయన సంగీతం అందించిన ఆ ఐదు సినిమాల సంగీతానికి కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇంతకు దేవి శ్రీ ప్రసాద్ కి అద్భుతమైన రీతిలో కలిసి వచ్చిన ఆ సంవత్సరం ఏది అనుకుంటున్నారా ..? ఆది మరేదో కాదు 2004 వ సంవత్సరం. ఈ సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సిమ్రాన్ హీరోయిన్గా రూపొందిన శంకర్ దాదా ఎం బి బి ఎస్ మూవీ కి మరియు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా జ్యోతిక , చార్మి హీరోయిన్లుగా రూపొందిన మాస్ మూవీ కి , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్రిష హీరోయిన్ గా రూపొందిన వర్షం మూవీ కి , అల్లు అర్జున్ హీరో గా రూపొందిన ఆర్య మూవీ కి , రవితేజ హీరో గా రూపొందిన వెంకీ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

ఈ ఐదు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. అలాగే ఈ ఐదు సినిమాల మ్యూజిక్ ని కూడా మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి. ఇలా 2004 వ సంవత్సరం దేవి శ్రీ ప్రసాద్ కి  అద్భుతమైన రీతిలో కలిసి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

dsp