మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె మలయాళ సినిమా అయినటువంటి ప్రేమమ్ మూవీ తో నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. ఈ సినిమాలో ఈమె నటించింది చాలా తక్కువ నీడివి ఉన్న పాత్రే అయినప్పటికి ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె పాత్రకు మంచి ప్రాధాన్యత దక్కడం , అలాగే చిన్న నిడివి పాత్ర అయినా కూడా ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఈ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.

మూవీ తర్వాత ఈమె తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. ఇక తెలుగులో ఇప్పటివరకు ఈ బ్యూటీ ఎన్నో సినిమాల్లో నటించింది. ఎన్నో విజయాలను కూడా ఈ బ్యూటీ అందుకుంది. ప్రస్తుతం కూడా ఈమె వరుస పెట్టి సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఈమెకు ఒక సినిమా ద్వారా విజయం దక్కిన కూడా మరో విషయంలో మాత్రం నిరాశే మిగిలినట్లు తెలుస్తోంది. అది ఏ సినిమా అనుకుంటున్నారా ..? ప్రేమమ్ విషయంలో. ప్రేమమ్ సినిమా చేసే సమయంలో ఈమె వయస్సు చాలా తక్కువ. ఆ సమయంలో ఆమె విద్యాభ్యాసం చేస్తోందట.

ఇక ప్రేమమ్ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఈమెకి వరుస పెట్టి అవకాశాలు వచ్చాయట. దానితో ఈమె చదువు మధ్యలో ఆపాల్సి వచ్చిందట. అలా ప్రేమమ్ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన విజయం , మంచి గుర్తింపు దక్కిన కూడా ఆ సినిమా సక్సెస్ తో ఈమెకి వరుస సినిమాలలో అవకాశాలు రావడం వల్ల ఈమె తన చదువుకు దూరం కావాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఏమైన కూడా అనుపమ పరమేశ్వరన్ ఇప్పటికే నటిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. వరుస పెట్టి సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ బిజీ నటిగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: