యావత్ టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ ఇంకా కొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా ప్రారంభంకానుంది. ఈ ఈవెంట్ కోసం సినీ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు.  సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 29వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం రూపొందించిన ప్రణాళికలు, సెట్ డిజైన్స్, ప్రోమో షూట్ ఏర్పాట్లు అన్నీ ప్రేక్షకులలో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈవెంట్‌ను ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతిగా మార్చేందుకు జక్కన్న అండ్ టీమ్ ప్రత్యేక కంటెంట్, వినూత్న ప్రెజెంటేషన్, హై-ఎండ్ టెక్నాలజీతో కూడిన ప్రోగ్రాం షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. షోలో ప్రతి సెగ్మెంట్‌ను ఒక ప్రత్యేక విజువల్ ప్రయాణంగా మార్చేందుకు రాజమౌళి తన సంతకమైన క్రాఫ్ట్‌ను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.


ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హోస్ట్‌లుగా తెలుగు ప్రేక్షకుల అభిమాన యాంకర్ సుమ కనకాల, అలాగే హిందీ అడియెన్స్ కోసం ప్రసిద్ధ యూట్యూబర్ ఆశీష్ చాంచలానీ వ్యవహరించనున్నారని ప్రచారం జరుగుతోంది. దీని కోసం వారు చేస్తున్న ప్రిపరేషన్స్ గురించి  ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో  బాగా వైరల్ గా మారింది. ఆ ఫోటోలో కనిపించిన ఏర్పాట్లు, రిహార్సల్స్ చూస్తే ఈ ఈవెంట్ కోసం రాజమౌళి ఎంత ప్యాషన్‌తో పనిచేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. ఇక చిత్రంలోని కాస్టింగ్ విషయానికి వస్తే, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే కీలకమైన పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో అలరించనున్నారు.  చీరలో గన్ ఫైర్ చేస్తూ ప్రియాంక అద్దిరిపోయే లుక్స్ లో కనిపించబోతుంది. వీరి పాత్రలు కథలో అత్యంత ప్రభావశీలమైనవిగా తెరకెక్కుతున్నాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.



‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌పై తెలుగు సినీ పరిశ్రమ అంతటా భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్ నుంచి ఎలాంటి ప్రపంచస్థాయి విజువల్స్, కథనాలు, క్యారెక్టర్ ఆర్క్స్ అందుకుంటామో అనేది అభిమానులలో ఆసక్తి రగిలిస్తోంది. మరి రేపు సాయంత్రం జరగబోయే ఈవెంట్ ఈ అంచనాలను మరింత ఎత్తుకు తీసుకెళుతుందా అన్నది చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: