తాజాగా ‘గ్లోబ్ ట్రాటర్’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయగా, పాట విడుదలైన కొద్ది గంటల్లోనే భారీ స్థాయిలో వైరల్ అయ్యింది. శ్రుతి హాసన్ తన ప్రత్యేకమైన హస్కీ వాయిస్‌తో ఈ పాటకు అందించిన కొత్త స్పిన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మ్యూజిక్, లిరిక్స్, విజువల్— అన్నీ ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.అయితే, ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో వివాదం తలెత్తింది. ఈ పాట హాలీవుడ్‌కి చెందిన ఒక ప్రముఖ పాప్ ఆల్బమ్‌లోని పాటతో పోలికలు ఉన్నాయంటూ కొంతమంది కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో SSMB29 ‘కాపీ’ రూమర్స్ బారిన పడింది.
ఇంతకుముందు ఈ చిత్రానికి విడుదలైన పోస్టర్లు కూడా ఓ విదేశీ ఫోటోషూట్‌ను పోలి ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది.కానీ ఇండస్ట్రీ వర్గాల మాట వింటే— రాజమౌళి గారికి గ్లోబల్ స్థాయిలో ఉన్న గుర్తింపు నేపథ్యంలో ఇలాంటి కాపీ పనులు చేయడం అసలు ఊహించలేనిదే అని చాలామంది స్పష్టంగా చెబుతున్నారు. “జక్కన్న ప్రాజెక్ట్ కి కాపీ ట్యాగ్ నా? ” అనే డైలాగులు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రూమర్స్‌ను పట్టించుకోకుండా మేకర్స్ తమ పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ, ఈ వివాదంపై వారు అధికారికంగా స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.ఏదేమైనా, శ్శంభ్29 విడుదలకు ముందే రూమర్స్, ఊహాగానాలు, అప్డేట్స్‌తో రికార్డు స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తోంది. అభిమానులు మాత్రం రేపు జరగబోయే టీజర్ లాంచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి