సినిమా విడుదలకు ముందు ఎవరైనా భారీ ఖర్చుతో పబ్లిసిటీని చేసి సినిమా మార్కెట్‌, హైప్ పెంచుకుంటారు. అయితే మూవీకి మంచి బిజినెస్ జ‌రిగేందుకు ఎవ‌రైనా ఖ‌ర్చు చేస్తారు. కానీ రాజ‌మౌళి అందుకు పూర్తి భిన్నం. ఆయ‌న సినిమాకు చేసే ప‌బ్లిసిటీని కూడా క్యాష్ చేసుకునే తెలివైన ద‌ర్శ‌కుడు అన‌డంలో సందేహం లేదు. బాహుబ‌లి 1, 2 సినిమాల‌ను ఆయ‌న ప‌బ్లిసిటీ చేసుకునేందుకు పైసా ఖ‌ర్చు పెట్ట‌లేదు. త‌న సినిమాల పబ్లిసిటీ కోసం ఎప్పుడూ పైసా ఖర్చు పెట్టని రాజమౌళి... ఇప్పుడు మహేశ్ బాబు తో చేస్తున్న సినిమా కోసం ఎదురు వసూలు మొదలు పెట్టారు. మహేశ్ బాబు సినిమా గ్రాండ్ ఈవెంట్ గ్లోబ్ ట్రాటర్ ను నవంబర్ 14న రామోజీ ఫిల్మ్ సిటీలో అట్ట హాసంగా చేస్తున్నారు.


ఈ ప్రోగ్రామ్‌లో ఇందులోని ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరెవరూ అనేది తెలియబోతోంది. అయితే ఏ నిర్మాత అయినా ఇలాంటి ఈ ఈవెంట్ ను భారీగా ఖర్చు పెట్టి చేసుకుంటారు. కానీ రాజ‌మౌళి టీం అదే చేస్తున్నా ఆ ఖ‌ర్చు చేయ‌డం లేదు.. ఎదురు రాబ‌ట్టుకుంటోంది. ఈ ఈవెంట్‌కు ఓ మీడియం మూవీకి అయ్యేంతగా దాదాపు 30 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ఈ ఈవెంట్ ను జియో హాట్ స్టార్ లో లైవ్ ఇస్తున్నారు. ఇందుకోస‌మే హాట్ స్టార్ ఏకంగా రు. 50 కోట్ల మొత్తం చెల్లిస్తున్న‌ట్టు తెలుస్తోంది.


వరల్డ్ వైడ్ తన సినిమాకు ప్రచారం జరగడం ఒక ఎత్తు అయితే ... దాని ద్వారా ఏకంగా రు. 50 కోట్లు ఆదాయం పొందడం రాజ‌మౌళి మాస్ట‌ర్ ప్లాన్ ఏ స్తాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. రాజమౌళి మాస్టర్ మైండ్ గురించి అవగాహన ఉంది కాబట్టే ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ ఏకంగా రెండు ద‌శాబ్దాల పాటు వెయిట్ చేశారు. కేఎల్ నారాయ‌ణ రెండు ద‌శాబ్దాల నిరీక్ష‌ణ‌కు త‌గిన‌ట్టుగానే ఇప్పుడు భారీ ప్ర‌తిప‌లం ద‌క్కుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో దీనిని రిలీజ్ చేసేలా ప‌క్కా ప్లానింగ్ జ‌రుగుతోంది.


దాదాపు వంద దేశాల్లో ఒకేసారి ఈ మూవీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. సహజంగా తన సినిమా పూర్తి అయ్యాకే రాజ‌మౌళి ప్ర‌చారం ప్రారంభిస్తారు. కానీ ఈ సారి ప్లాన్ మార్చేశారు. ఈ సినిమా రెండు .. మూడు షెడ్యూల్స్ పూర్తి కాగానే ఓ పెద్ద బ్యాంగ్ తో త‌న ప్ర‌చారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక రెండు భాగాలుగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇక ఈ సినిమాను రాజ‌మౌళి త‌న గ‌త సినిమాల లా కాకుండా .. ఈ సినిమా షూటింగ్ స్పీడ్‌గా పూర్తి చేసి రిలీజ్ చేసేలా ప్లానింగ్ న‌డుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: