దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈసారి ఎప్పటిలాగే కాకుండా మరింత సైలెంట్ ప్రమోషన్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. తన కొత్త సినిమా ఎస్ఎస్ఎంబీ 29 చుట్టూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఒక్కొక్కటిగా ఫస్ట్‌లుక్స్, పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నారు. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా శృతి హాసన్ పాడిన పాటను విడుదల చేయడం, అదే విధంగా పృథ్విరాజ్ సుకుమారన్ లుక్‌ని సడెన్‌గా రివీల్ చేయడం జక్కన్న అందరికి సర్‌ప్రైజ్‌గా నిలిచింది. తాజాగా ప్రియాంకా చోప్రాను పరిచయం చేసిన తీరు అయితే అందరినీ ఆశ్చర్యపరిచింది. పసుపు పచ్చని చీరలో తుపాకీ చేత పట్టుకుని బుల్లెట్లతో శత్రువులపై ఎదురుదాడి చేసే వీరనారి మందాకినీగా ఆమె లుక్ కనిపించింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ లుక్స్‌పై రకరకాల డీకోడ్‌లు మొదలయ్యాయి. లీకైన సమాచారం ప్రకారం మహేష్ బాబు పాత్ర పేరు రుద్ర, అంటే శివుడి రూపం. సినిమాకు బ్యాక్‌డ్రాప్ వారణాసిగా ఉంటుందని, షూటింగ్‌లో కాశీ వాతావరణం కనిపించటమూ, హీరో మెడలో లాకెట్ వంటివి అన్నీ నీలకంఠుడి సూచనగా ఉన్నాయి. మరోవైపు ప్రియాంకా పాత్ర పేరు మందాకినీ అంటే గంగా మాతకు మరో పేరు. అలా చూస్తే, రుద్ర - మందాకినీ అనుబంధం సింబాలిక్‌గా శివ - గంగా సంబంధాన్ని సూచిస్తున్నట్టుంది.
అదే విధంగా పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర పేరు కుంభ, అంటే కుంభకర్ణుడి ఆధారంగా ఉండవచ్చని అభిమానులు ఊహిస్తున్నారు. రావణాసురుడి సోదరుడైన కుంభకర్ణుడు, ఈశ్వరుడికి పరమభక్తుడు. ఈ కోణంలో చూస్తే కథలో పౌరాణిక టచ్, ఆధ్యాత్మిక సింబాలిజం కలిసిన ప్యాన్ వరల్డ్ కాన్సెప్ట్‌గా ఉండబోతోందన్న అంచనాలు వస్తున్నాయి. ఈ మొత్తం సెటప్ వెనుక రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ మాస్టర్ బ్రెయిన్‌గా ఉన్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన రాసిన ఆలోచనాత్మక కథను జక్కన్న తన విజువల్ మేజిక్‌తో ప్రపంచస్థాయిలో చూపించబోతున్నారని ఫిలింసర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి