రజినీకాంత్ కమల్ హాసన్ లు రియల్ లైఫ్ లో ఎంత మంచి స్నేహితులో చెప్పనక్కర్లేదు. వీరు నిజ జీవితంలో చాలా దగ్గరి మిత్రులు..అలా వీరి మధ్య బాండింగ్ పెరుగుతూనే వస్తోంది. సినిమాల మట్టుకు ఒకరి మధ్య ఒకరికి పోటీ ఉన్నప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం వీరు చాలా మంచి స్నేహితులు.. అయితే అలాంటి వీరి కాంబోలో సినిమా రావాలని ఎప్పటినుండో అభిమానులు కోరుకుంటున్నారు.ఇక అందరూ అనుకుంటున్నట్లే కూలీ సినిమా తర్వాత రజినీకాంత్ కమల్ హాసన్ కాంబోలో సినిమా రాబోతుంది అని వార్తలు వినిపించాయి. కానీ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ఇప్పటివరకు ఫిక్స్ అవ్వలేదు. అయితే తమిళ్ డైరెక్టర్లను పక్కనపెట్టి తెలుగు డైరెక్టర్ తో వీరిద్దరి కాంబోలో సినిమా తీయాలని కొంతమంది భావించినప్పటికీ అది కూడా కుదరడం లేదట.

ఇక వీరిద్దరి కాంబోలో సినిమా అంటే చాలా మంది లో ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. అలాగే వీరిద్దరిలో ఏ ఒక్కరి తక్కువ చేసి చూపించకుండా సమానంగా చూపించాలి.ఇక వీరిద్దరిని మేనేజ్ చేయాలంటే కచ్చితంగా ఒక స్టార్ డైరెక్టర్ కావాలి అని అనుకుంటున్నారట మేకర్స్. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ కమల్ హాసన్లను ధనుష్ డైరెక్ట్ చేయబోతున్నట్టు తమిళ్ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ధనుష్ ఇప్పటికే ఇడ్లీ కడై, రాయన్, నీక్ వంటి సినిమాలతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. అలా రజినీకాంత్ కమల్ హాసన్ కోసం ధనుష్ మరోసారి దర్శకుడి అవతారం ఎత్తబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇదే నిజమైతే రజినీకాంత్ సినిమాకి ధనుష్ డైరెక్షన్ చేయడం రజనీ కూతురు ఒప్పుకుంటుందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ లు విడాకులు తీసుకున్నారు.. కానీ కొంతమందేమో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పర్సనల్ లైఫ్ ని వేరేగా ప్రొఫెషనల్ లైఫ్ వేరేగా తీసుకుంటారు. ప్రొఫెషనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని అస్సలు కలుపుకోరు.ఒకవేళ రజినీకాంత్ కమల్ హాసన్ సినిమాకి ధనుష్ దర్శకుడిగా చేస్తే ఐశ్వర్య అడ్డు చెప్పదు అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే మొదట ధనుష్ రజినీ కాంత్ ల మూవీకి తమిళ ప్రముఖ దర్శకుడు సుందర్. సి దర్శకత్వం వహిస్తున్నట్టు వార్తలు వినిపించాయి.కానీ ఆ తర్వాత పది రోజులకే ఈ సినిమా నుండి డైరెక్టర్ తప్పుకున్నారు. దాంతో మళ్లీ దర్శకుడి వేటలో పడ్డారు చిత్ర యూనిట్.

మరింత సమాచారం తెలుసుకోండి: