రూపా మాయాజాలం.. ‘ఒలా ఒలా’ సాంగ్ గ్లామర్!
‘ఆరెంజ్’లో షాజాన్, రామ్ చరణ్‌కు ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్‌గా 'రూపా' పాత్రలో కనిపించింది. “రూబ… రూబ…” అంటూ చరణ్ ఫ్లాష్‌బ్యాక్‌లో ఆమెను గుర్తుచేసుకునే సీన్స్, ‘ఒలా ఒలా’ పాటలో ఆమె చూపించిన అల్ట్రా గ్లామర్ షో.. ఇప్పటికీ యూత్‌కు ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్. బొంబాయి – గోవా బ్యూటీ కంటెస్ట్ విన్నర్ అయిన షాజాన్... ఆ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువైనా, తనదైన మార్కు వేసి టాలీవుడ్‌ను పలకరించింది. ఆ తర్వాత హిందీలో కొన్ని సినిమాల్లో మెరిసినా... 2015 తర్వాత తెలుగు స్క్రీన్ పై పెద్దగా కనిపించకుండా పోయింది.
పదేళ్లైనా చెక్కుచెదరని ఫిగర్.. గ్లామర్ క్వీన్!
అయితే ఇన్నేళ్ల తర్వాత షాజాన్ పదమ్సీ గురించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక అప్‌డేట్ ఇప్పుడు ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది! సినిమాలకు దూరంగా ఉన్నా.. ఆమె అందం మాత్రం పదేళ్లైనా చెక్కుచెదరలేదంట! ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేస్తున్న లేటెస్ట్ ఫోటోలు చూస్తే.. షాజాన్ పదమ్సీ ఇప్పటికీ అదే గ్లామర్, అదే బ్యూటీని మెయింటైన్ చేస్తోంది. పొడవాటి జుట్టు, అత్యంత ఫిట్ అండ్ స్టైలిష్ బాడీతో ఆమె చేస్తున్న పోస్టులు కుర్రకారు గుండెల్లో మళ్లీ 'ఆరెంజ్' ఫీవర్‌ను పెంచేస్తున్నాయి. సినిమాలకు దూరంగా ఉన్నా తన ఫిట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించుకోలేదని ఆమె ఫోటోలు చూస్తే అర్థమవుతోంది.
ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయిన షాజాన్.. ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తోంది. తన తండ్రితో కలిసి ప్రొడక్షన్ హౌస్ నడుపుతూ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ చేస్తోంది. 2022లో లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న ఈ బ్యూటీని చూస్తుంటే.. త్వరలోనే మళ్లీ టాలీవుడ్ తెరపై సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతుందేమో అని అభిమానులు ఆశపడుతున్నారు. ఎందుకంటే, ఆమె గ్లామర్ ఇప్పుడూ మాస్ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఉంది!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి