ప్రస్తుతం ఈ ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సినిమాల్లోకి వచ్చే ముందు నేను ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో పని చేసేదాన్నని సంయుక్త మీనన్ చెప్పారు. చిన్నప్పటి నుంచే క్రియేటివ్ ఫీల్డ్‌పై తనకు ఆసక్తి ఉండేది అని. అందుకే ఈవెంట్ ప్లానింగ్, క్రియేటివ్ ప్రెజెంటేషన్, కమ్యూనికేషన్ వంటి నైపుణ్యాలను అక్కడే నేర్చుకున్నానని ఆమె తెలిపింది.అదే సమయంలో, తాను పనిచేసిన ఈవెంట్ కంపెనీ అనేక సినిమా ఈవెంట్లను కూడా నిర్వహించేదని, ఆ సందర్భాల్లో సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడినట్లు సంయుక్త మీనన్ చెప్పింది. .
అలానే ఆ పరిచయాల ద్వారా తాను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని ఆమె వెల్లడించింది.ఈ విషయాలు వినగానే ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “ఇంత టాలెంట్ ఉన్న ఆమె ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో పనిచేసిందా?” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. సంయుక్త మీనన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి