- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో మరోసారి తన సత్తా చాటుకుని సాలిడ్‌గా వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటికే వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ బిజీగా మారాడు. వాటిలో భారీ అంచనాలు ఉన్న సినిమావెంకీ 77 ”. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో వెంకీ జ‌త క‌ట్ట‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ బజ్ నెలకొంది. త్రివిక్రమ్ - వెంకటేష్ కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎక్క‌డా లేని ఆస‌క్తి ఉంటుంది. గతంలో వచ్చిన “నువ్వు నాకు నచ్చావ్”, “మల్లీశ్వరి” వంటి చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాయి. ఈ రెండు సూప‌ర్ హిట్ సినిమాల‌కు త్రివిక్ర‌మ్ ర‌చ‌యిత‌గా ప‌నిచేశారు. ఇన్నేళ్ల త‌ర్వాత ఇప్పుడు వెంకీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ద‌క్కించుకున్నారు.


ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్‌లోకి దూసుకెళ్లింది. కథ, క్యాస్టింగ్, గెటప్ అన్నీ సీక్రేట్‌గా ఉంచినా.. ఇండస్ట్రీ టాక్ ప్రకారం వెంకీ సరసన త్రిష మరియు శ్రీనిధి శెట్టి నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోయిన్ల‌తో త్రివిక్రమ్ ల‌వ్‌, ఎమోష‌న‌ల్ డ్రామాను మిక్స్ చేయ‌బోతున్నార‌ట‌. ఇక ఈ సినిమా టైటిల్‌పై కొద్ది రోజులుగా పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది. మొదట నుంచి “వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం” అనే టైటిల్‌ను సెట్ చేశారని వార్తలు వచ్చాయి. వెంకట రమణ అనే పేరు వెంకటేష్‌కు బాగా కలిసొచ్చిన పేరు కావడంతో ఆ పేరును టైటిల్‌గా పెట్టాలనుకున్నారని టాక్. కానీ కొన్ని రోజుల తరువాత మరో టైటిల్‌గా కుటుంబ‌రావు పేరు ప్ర‌చారంలోకి వ‌చ్చింది.


అయితే ఇప్పుడు ఈ రెండు పేర్లు కాదు, కొత్త పేరు ఫైనల్ అయినట్లు టాక్ ? ఇండస్ట్రీ బజ్ ప్రకారం “బంధుమిత్రుల అభినందనలతో” అనే టైటిల్‌ని త్రివిక్రమ్ ఖరారు చేశారట. త్రివిక్రమ్ టైటిల్స్ కథకు ముందే ఆలోచనను చెబుతుంటాయి. దీని అర్ధం కావాలంటే సినిమా చూడాల్సిందే, కానీ భావన మాత్రం వెంటనే కనపడుతుంది. ఆ క్రమంలో ఈ కొత్త టైటిల్ కూడా పూర్తిగా కుటుంబ నేపథ్యం, బంధాలు, భావోద్వేగాలు, సంబంధాల విలువల చుట్టూ తిరిగే కథకు సరిగ్గా సూట్ అవుతుందని సమాచారం. ఏదేమైనా ప్రేక్షకులు మాత్రం ఈ కాంబినేషన్‌పై ఉన్న ప్రేమతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: