హీరోయిన్ సమంత ఎట్టకేలకు ఇన్ని రోజులుగా వస్తున్న రూమర్లకు తెరదించేసింది.రాజ్ నిడిమోరు తో చెట్టాపట్టాలేసుకొని తిరిగి ఎన్నో విమర్శలు మూటగట్టుకున్న సమంత ఫైనల్ గా ఆయనతో ఏడడుగులు వేసి పెళ్లి బంధంలోకి అడుగు పెట్టింది. నాగచైతన్య పెళ్లి చేసుకున్న ఏడాదికే సమంత కూడా రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది. ఇక సమంత రెండో పెళ్లిపై పలువురు అభిమానులు, నెటిజెన్లు, సెలెబ్రెటీలు కంగ్రాట్స్ చెబుతూ కొత్త జీవితం హాయిగా సాగిపోవాలని కామెంట్లు పెడుతూ ఉంటే కొంత మంది మాత్రం విమర్శలు చేస్తున్నారు.ముఖ్యంగా ఒక నటి సమంతపై పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఒకరి జీవితాన్ని బలి చేసి సంతోషంగా ఉండాలనుకుంటున్నావు అంటూ ఆ నటి పెట్టిన పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది.

మరి ఇంతకీ ఆ నటి ఎవరయ్యా అంటే..పూనమ్ కౌర్.. తాజాగా పూనమ్ కౌర్ తన సోషల్ మీడియా ఖాతాలో సమంత రెండో పెళ్లి పై ఇన్ డైరెక్ట్ గా విమర్శలు గుప్పించింది.. పూనమ్ కౌర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది.సొంతగూడు కట్టుకోవడం కోసం మరొకరి గూడును పడగొట్టడం చాలా బాధాకరం..నిస్సహాయ,బలహీనమైన పురుషులను డబ్బుతో కొనవచ్చు.కానీ ఈ అహంకారపూరిత మహిళను పెయిడ్ పిఆర్ చాలా గొప్ప మహిళగా చూపిస్తున్నారు..అంటూ ఒక షాకింగ్ ట్వీట్ పెట్టింది. అయితే ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారడంతో చాలా మంది నెటిజన్లు సమంత రెండో పెళ్లి గురించి పూనమ్ కౌర్ ఈ ట్వీట్ పెట్టిందని మాట్లాడుకుంటున్నారు.

ముఖ్యంగా సమంత రాజ్ ని పెళ్లి చేసుకోవడం కోసం మొదటి భార్య ని విడగొట్టింది.శ్యామిలీ దే జీవితాన్ని బలి చేసి సమంత హ్యాపీగా ఉండాలని చూసింది అంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అలాగే రాజ్ నిడిమోరు బలహీనమైన నిస్సహాయ పురుషుడని, సమంత ఫేమ్ డబ్బును చూసి ఆమెకు అట్రాక్ట్ అయ్యాడు అన్నట్లుగా అర్థం వచ్చేలా పూనమ్ కౌర్ పెట్టిన ఈ పోస్టు నెట్టింట సంచలనంగా మారింది. ఏది ఏమైనప్పటికి పూనమ్ కౌర్ పెట్టిన ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో చిచ్చు పెట్టింది. అయితే సమంత అభిమానులు ఈ ట్వీట్ పై కౌంటర్లు ఇస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం పూనమ్ కౌర్ పెట్టిన పోస్ట్ కరెక్ట్ అంటూ మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: