సమంత రాజ్ నిడిమోరులు ఎట్టకేలకు ఈరోజు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు.చాలా రోజుల నుండి విమర్శలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఎన్నో విమర్శలు మూటగట్టుకున్న ఈ జంట ఫైనల్ గా మూడుముళ్ల బంధంతో ఒక్కటైపోయారు. సమంతకు ఎంతో ఇష్టమైనటువంటి ఈశా యోగా సెంటర్ లోని లింగ భైరవి అమ్మవారి సన్నిధిలో భూతశుద్ధ ఆచారంలో వివాహం చేసుకున్నారు. అయితే ఈ భూత శుద్ధ వివాహం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. ముఖ్యంగా ఈ భూత శుద్ధ వివాహం వల్ల దంపతులు లోతైన బంధంలోకి వెళ్ళిపోతారట. అంతేకాకుండా వధూవరుల ఇద్దరి దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తారట. ఈ ఆచారంలో పెళ్లి చేసుకున్న వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సమంత ఇంత రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది..

నాగచైతన్య రెండో పెళ్లి కూడా అందరికీ చెప్పి అఫీషియల్ గా చేసుకున్నారు. కానీ సమంత మాత్రం ఎందుకు ఇలా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సమంత ఇంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం వెనుక కారణం ట్రోలర్స్ అని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సమంత ఏం చేసినా కూడా దాన్ని ట్రోల్ చేస్తున్నారు.ముఖ్యంగా ఎప్పుడైతే సమంత నాగచైతన్య నుండి విడిపోయిందో అప్పటినుండి అంతా సమంతదే తప్పు అన్నట్లు కొంతమంది వేలెత్తి చూపటమే కాకుండా అక్కినేని ఫ్యాన్స్ సమంతను టార్గెట్ చేసినట్టు ఎక్కువగా కనిపించింది. సమంత ఏడ్చినా కూడా చాలామంది ఫేక్ ఏడుపు, దొంగ ఏడుపు అంటూ విమర్శలు చేశారు. అలాగే ఎప్పుడైతే రాజ్ నిడిమోరు తో కలిసి కనిపించిందో అప్పటినుండి ఆమెపై మరిన్ని విమర్శలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకుంటే తప్పులేదు.

 కానీ సమంత మాత్రం రాజ్ నిడిమోరుతో తిరిగితే ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్లు అందరూ వేలెత్తి చూపించారు. అయితే ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా సమంత వాటిని పట్టించుకోలేదు.ఫైనల్ గా తాను ప్రేమించిన రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది.ముఖ్యంగా సమంత ట్రోలర్స్ కి భయపడే ఇలా రహస్యంగా తన పెళ్లి చేసుకున్నట్టు అర్థమవుతుంది.ఇక ఎంత రహస్యంగా పెళ్లి చేసుకున్నప్పటికీ సమంత తన అభిమానుల ముందు పెళ్లి విషయాన్ని దాచిపెట్టలేదు. కొంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నా కూడా కొద్ది రోజులు రహస్యంగా కాపురం చేసి ఆ తర్వాత తమకు పెళ్లయిన విషయాన్ని బయట పెడుతున్నారు.కానీ సమంత అలా కాదు పెళ్లయిన విషయాన్ని తన అభిమానులతో ఫోటోల ద్వారా పంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: