ఈ పాత వీడియో ఇప్పుడు బయటకు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కొందరు నెటిజన్లు—“ బన్నీ అప్పుడే ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాకి ప్రమోషన్ ఇచ్చేశాడా?”..“10 ఏళ్ల క్రితమే బన్నీకి స్పిరిట్ సినిమా గురించి తెలుసా?”
అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు అయితే—“అదృష్టం అనే ఒకటి ఉంటే ఇదే… అప్పుడే ధరించిన టీ-షర్ట్ నేటి పరిస్థితుల్లో ఇంత పెద్ద వైరల్ టాపిక్ అవుతుందా!”అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ వేసుకున్న ఆ టీ-షర్ట్ క్లిప్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ప్రభాస్ ‘రెబల్’ సినిమా పేరుతో పాటు ఇప్పుడు తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా పేరు కూడా అదే టీ-షర్ట్‌పై ఉండటంతో, ప్రభాస్ అభిమానులు బన్నీని ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్–ప్రభాస్ అభిమానుల మధ్య ఈ చిన్న సంఘటన ఒక చిన్న పండగలా మారింది.అందుకే సోషల్ మీడియాలో ఈ వీడియో మరింత వేగంగా వైరల్ అవుతోంది. అభిమానుల మధ్య కొత్తగా ఫ్రెండ్లీ క్రేజ్, విశేష చర్చలకు దారితీస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి