- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్‌లో 2025 మ‌రో యేడాది కాల‌గ‌ర్భంలో క‌లిసి పోనుంది. ఈ యేడాదిలో ఇప్ప‌టికే 11 నెల‌లు పూర్త‌య్యాయి. మ‌రో 30 రోజుల్లో ఈ యేడాది కూడా చ‌రిత్ర‌లో క‌లిసి పోనుంది. ఇక ఈ యేడాది చివ‌రి నెల ను విజ‌య‌వంతంగా పూర్తి చేసేందుకు టాలీవుడ్ రెడీ అవుతోంది. డిసెంబ‌ర్ లో బిగ్గెస్ట్ ఎట్రాక్ష‌న్ గా నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన అఖండ 2 వ‌స్తోంది. బాల‌య్య - బోయ‌పాటి కాంబినేష‌న్ అంటేనే తిరుగులేని కాంబినేష‌న్‌. ఇప్ప‌టికే సింహా - లెజెండ్ - అఖండ వ‌రుస‌గా మూడు సినిమాల‌తో హ్యాట్రిక్ హిట్లు కొట్టారు. అందులోనూ అఖండ సినిమా సూప‌ర్ డూప‌ర్ .. ఈ అఖండ సినిమాకు ఈ సీక్వెల్‌గా వ‌స్తోన్న అఖండ 2 - తాండ‌వం పై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇక యేడాది నుంచి ఊరిస్తూ వ‌స్తోన్న అఖండ 2 ఈ నెల 5న వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. అయితే ఒక రోజు ముందుగానే 4న ప్రిమియర్స్ తో సందడి చేయడానికి సిద్ధంగా వుంది అఖండ 2. ఇదే వారంలో శర్వానంద్ బైకర్ సినిమా ప్రకటించారు కానీ మళ్ళీ వెనక్కి త‌గ్గారు.


ఇక తొలి వారం అంతా అఖండ 2 సంద‌డి తోనే థియేట‌ర్లు నిండి పోనున్నాయి. ఆ త‌ర్వాత డిసెంబర్ రెండో వారంలో రోషన్ కనకాల మొగ్లి సినిమాతో వస్తున్నాడు. కలర్ ఫోటో సందీప్ రాజ్ ఈ సినిమాకి దర్శకుడు కావ‌డం తో పాటు టీజ‌ర్ సైతం ఆసక్తిగా ఉండ‌డంతో అంచ‌నాలు ఉన్నాయి. ఇక రోష‌న్ బ‌బుల్‌గ‌మ్ సినిమా తో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఆ సినిమా అనుకున్నంత‌గా ఆడ‌లేదు.. అందుకే రోష‌న్ టాలీవుడ్ లో హీరోగా నిల‌దొక్కు కోవాల‌నుకుంటే ఈ సినిమా హిట్ అవ్వ‌డం అత్య‌వ‌స‌రం అనుకోవాలి.


నందు సైక్ సిద్ధార్థ్ సినిమాతో వస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్ చేస్తుండడం.. టీజ‌ర్ యూత్‌కు న‌చ్చేలా ఉండ‌డం ప్ల‌స్ కానుంది. ఇక ‘సకుటుంబానాం’ ఫ్యామిలీ సెంటిమెంట్‌ వున్న సినిమా ఇది. ఈ మూడు సినిమాలూ డిసెంబర్ 12న వస్తున్నాయి. ఇక మూడో వారంలో అవ‌తార్ 3 హంగామా ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. అందులోనూ ఇండియాలో అవ‌తార్ సీక్వెల్‌కు తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది.


డిసెంబర్ మూడో వారం అవతార్ 3 హంగామా వుంటుంది. అవతార్ కి ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ వుంటుంది. జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన మూడో భాగం డిసెంబరు 19న విడుదల కానుంది. మల్టీ ఫ్లెక్స్ ఆడియన్స్సినిమా కోసం ఆసక్తిగా ఎదు రుచూస్తున్నారు. నాలుగో వారం ఆది సాయికుమార్ శంబాల‌, ఆ త‌ర్వాత శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటించిన ‘ఛాంపియన్‌’ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. స్వ‌ప్న సినిమాస్ నిర్మాణంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. శివాజీ, నవదీప్ ప్రధాన పాత్రల్లో ‘దండోరా’ కూడా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మ‌రి ఇందులో ఏయే సినిమాలు స‌క్సెస్ అయ్యి ఈ యేడాదిని విజ‌య‌వంతంగా ముగిస్తాయో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: