నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సినిమా అఖండ 2 తాండవం. గత యేడాది కాలంలో ఊరిస్తూ వస్తోన్న ఈ సినిమా కు రిలీజ్‌కు ముందే దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చేసింది. అయితే అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ ఊహించని విధంగా వాయిదా పడింది. ఏపీ తో పాటు అటు ఓవర్సీస్ మార్కెట్ లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే చివరి నిమిషంలో అనూహ్యంగా ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. శుక్రవారం సినిమా అయినా రిలీజ్ అవుతుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
ఇలా దేశ వ్యాప్తంగా అఖండ 2 సినిమా రిలీజ్ ఆగింది. అయితే బుకింగ్స్ లో మాత్రం ఆఖండ జోరు ఆగలేదు. బైక్ మై షోలో సినిమా రిలీజ్ వాయిదా పడినా కూడా ఏకంగా గంటకు వెయ్యి టిక్కెట్లు అమ్ముడు అవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిని బట్టి అఖండ 2 కోసం ఆడియెన్స్ ఎలా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతోంది. ఇక ఈ సినిమా కి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహించారు. బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో సింహా - లెజెండ్ - అఖండ సినిమాలు మూడు సూపర్ హిట్ అవ్వడం తో ఇప్పుడు అఖండ 2 మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి