టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ 2 విడుదల కోసం బాలకృష్ణ అభిమానుల తో పాటు టోటల్ తెలుగు సినీ అభిమానులు అందరూ కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా సినిమా వాయిదా పడినప్పటి నుంచి, టీమ్ నుంచి వచ్చే చిన్న చిన్న సంకేతాలు కూడా అభిమానుల్లో ఎక్కడా లేని ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ఇక త్వరలోనే అఖండ 2 రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వస్తుందని ఒక్కటే కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ వెయిట్ చేస్తున్నారు. ఇదిలా వుంచితే, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చే NBK111 గురించి మాత్రం వరుస అప్‌డేట్లు వస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన వీరసింహా రెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
ఇక ఇప్పుడు వీరి కాంబోలో వస్తోన్న ఈ సినిమా లో నయనతార హీరోయిన్ గా ఎంపికైంది. నయన్ మహారాణి పాత్రలో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం సినిమా ప్రీ - ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న అప్‌డేట్ ఇస్తూ ఈ సినిమా మ్యూజిక్ వర్క్ ప్రారంభమైందని తెలిపాడు. అలాంటి ఒక చిన్న పోస్ట్‌తోనే అభిమానుల్లో కొత్తగా హైప్ మొదలైంది. ఈ చిత్రం పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నయనతార ఈ సినిమా తో మళ్లీ బాలయ్యతో జతకట్టడం కూడా ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెంచుతోంది. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమైన తర్వాత వరుస అప్‌డేట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి