- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్‌లో పొడవైన హీరోల లిస్టు తీస్తే అందరి నోట మొదటగా వచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్దే. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న టాలెస్ట్ హీరోల్లో ప్రభాస్ టాప్ పేర్లలో ఒకటి. అతని తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో పొడవైన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. సరిగ్గా ఆరడుగుల ఎత్తుతో, స్టైలిష్ లుక్‌తో స్థిరమైన ప్రెజెన్స్ ఉన్న మహేష్ కేవ‌లం సౌత్‌లోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లోను బెస్ట్ లుకింగ్‌ హీరోల్లో ఒకడిగా ఉంటాడు. కానీ తాజాగా బాలీవుడ్ నటి కృతి సనన్ చేసిన కామెంట్  మహేష్ అభిమానుల్లో ఆశ్చర్యం మాత్రమే కాదు, కొంత ఆగ్రహం కూడా రేకెత్తించింది. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న కృతి ఇటీవల విడుదలైన ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఆమె తో తమిళ క్రిటిక్ భరద్వాజ్ రంగన్ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. అదే ఇంటర్వ్యూలో కృతి హైట్ చర్చకు వచ్చింది.


“ మీరు చాలా పొడవున్న హీరోయిన్‌… మీతో నటించిన హీరోల్లో చాలామంది మీ కంటే పొట్టివాళ్లే కదా ? ” అని భరద్వాజ్ రంగన్ అడగగా, కృతి నవ్వుతూ “ అవును, నా కంటే ఎత్తు తక్కువ ఉన్న హీరోలతోనే ఎక్కువగా పని చేశాను ” అని చెప్పింది. అదే సందర్భంలో తాను పనిచేసిన హీరోలలో తనకంటే పొడవైన వారు ప్రభాస్, అర్జున్ కపూర్ మాత్రమే అని పేర్కొంది. అయితే ఇక్కడే వివాదం మొదలైంది. కృతి తన కెరీర్ తొలి సినిమా ‘1 నేనొక్కడినే’ లో నటించిన మహేష్ బాబు పేరును పూర్తిగా మర్చిపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా, కృతికి గుడ్ స్టార్ట్ ఇచ్చింది. ఆమె నటనకు అప్పట్లో మంచి ప్రశంసలు కూడా లభించాయి. అంతటి స్పెషల్ డెబ్యూ ఇచ్చిన మహేష్ పేరు కృతి మాటల్లో లేకపోవడం అభిమానులకు అస్సలు నచ్చలేదు.


నెటిజన్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు. ఈ “ సినిమా పెద్ద హిట్ కాకపోయినా మహేష్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది కదా… కనీసం గుర్తైనా పెట్టుకోలేదా ? ” .. “ప్రభాస్, అర్జున్ పేర్లు చెప్పి .. మ‌హేష్‌ పేరు ఎలా మరిచిపోయింది ? ” మ‌హేష్ ఫ్యాన్స్ ఆమెపై భ‌గ్గుమంటున్నారు. కృతి సనన్‌ ఉద్దేశపూర్వకంగా మహేష్ బాబు పేరును చెప్పలేదా ?  లేదా పొర‌పాటును మ‌ర్చిపోయిందా ? అన్న‌ది ప‌క్క‌న పెడితే ఫ్యాన్స్ మాత్రం ఆమె కామెంట్లు జీర్ణించు కోలేక‌పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: