అందుకు నిదర్శనంగానే ఇటీవల చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించిన టైటిల్ లాంచ్ ఈవెంట్ దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ విశేష స్పందనను రాబట్టుకుంది. “వారణాసి” అనే టైటిల్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్స్ వరదలా పెరిగాయి. జక్కన్న విజన్ పాన్–ఇండియా నుంచి పాన్–వరల్డ్ లెవల్‌కి ఎలా వెళ్లిందో మళ్లీ ఒకసారి చూపించే ప్రయత్నం ఇదేనని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.ఈ ఈవెంట్ సందర్భంగా మహేష్ బాబు పాత్రకు సంబంధించిన ఒక కీలక విషయాన్ని రాజమౌళి స్వయంగా హింట్ ఇవ్వడం అభిమానుల్లో ఊహలకు మరో స్థాయి ఇచ్చింది. సినిమాలో మహేష్ బాబు రుద్రుడిగానూ, శ్రీరాముడిగానూ కనిపిస్తారని టైటిల్ లాంచ్ ఈవెంట్‌లోనే అధికారికంగా ధృవీకరించబడింది. దేవతా స్వరూపాల్లో మహేష్ కనిపిస్తారని తెలిసిన క్షణాల్లోనే అభిమానుల్లో ఆసక్తి అసమాన్యంగా పెరిగిపోయింది.
అంతటితో ఆగకుండా, సినిమా మొత్తం మహేష్ బాబు ఐదు విభిన్న గెటప్స్ లో కనిపిస్తారనే వార్త కూడా ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే రెండు లుక్స్ రివీల్ అయినా, మిగిలిన మూడు లుక్స్ కూడా సినిమాలో అత్యంత కీలక సమయాల్లో కనిపిస్తాయని టాక్. ప్రతి గెటప్‌కూ ప్రత్యేక పాత్ర నేపథ్యం, వేరే వేరే ఎమోషనల్ పాయింట్స్, వినూత్న యాక్షన్ డిజైన్ ఉండబోతుందని కోలీవుడ్, బాలీవుడ్ ట్రేడ్ వర్గాలూ ఇప్పటికే విశ్లేషణలు చేస్తున్నారు.మహేష్ బాబు ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని విధంగా పూర్తిగా పరివర్తన చెందుతూ, తన నటనా ప్రస్థానంలో మరో కొత్త మైలురాయిని అందుకుంటున్నారని అభిమానులు గర్వంగా చెబుతున్నారు. రాజమౌళి సినిమా అని చెప్పగానే ప్రత్యేక విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్సెస్, దైవిక కాన్సెప్ట్స్ అన్నీ కలిసే ఉంటాయని తెలిసిందే. అలాంటి సందర్భంలో హీరోగా మహేష్ బాబు ఐదు వేరువేరు రూపాల్లో దర్శనం ఇవ్వడం నిజంగా సినీ ప్రేమికులకు పండగే అనిపించే విషయం.
అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో, వాస్తవ రూపం ఎలా ఉంటుందో అన్నది ఇంకా అధికారిక రీతిలో వెల్లడికావాల్సి ఉంది. టైటిల్ లుక్ మాత్రమే ఈ స్థాయి హైప్ క్రియేట్ చేస్తే, టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.మొత్తానికి, మహేష్ బాబు అభిమానులు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ‘జక్కన్న – మహేష్’ కాంబినేషన్, ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమ మొత్తం కళ్ల ముందే వేదికపైకి వచ్చే సమయం ఆసన్నమవుతోంది. ఈ సినిమా విడుదలయ్యే రోజున ప్రపంచ సినిమా మళ్లీ భారతీయ సినిమాని చూసి ఆశ్చర్యపోవడం ఖాయమని పరిశ్రమ అంతా ధీమాగా చెబుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి