టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2 తాండవం. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఈ నెల 5నే థియేటర్ల లోకి రావాల్సి ఉంది. అయితే పలు కారణాలతో వాయిదా పడి ఎట్టకేలకు గురువారం రాత్రి నుంచి ప్రీమియర్ షోలతో థియేటర్ల లోకి దిగుతోంది. ఇక రేపటి నుంచి అఖండ 2 - తాండవం రెగ్యులర్ షోలు స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా అఖండ మాసివ్ మ్యానియా అయితే మొదలైపోయింది. ఇప్పుడు బుకింగ్స్ లో వారం గ్యాప్ వచ్చినా .. రిలీజ్ డేట్ వాయిదా వేసినా కూడా ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం .. అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతుండడం ట్రేడ్ వర్గాలతో పాటు టోటల్ టాలీవుడ్ కే షాకింగ్ గా మారింది.
వారం రోజుల పాటు వాయిదా పడినా కూడా .. సినిమా పై కాస్త ఉత్సాహం తగ్గిందని ఫ్యాన్స్ అనుకున్నా కూడా ఇప్పుడు వారం తర్వాత బుకింగ్స్ ఓపెన్ చేసుకున్న ఈ సినిమా అంతకు మించిన ర్యాంపేజ్ చూపిస్తుంది అని చెప్పాలి. అఖండ 2 హవర్లీ ట్రెండింగ్ లో సైతం దూసుకు పోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల లో హైక్స్ ఉన్నా కూడా 2 డీ, 3 డీ అని లేకుండా అఖండ 2 టిక్కెట్లు బాగా తెగుతున్నాయి. ఇక అఖండ 2 సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి