టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. సంయుక్తా మీనన్మూవీ లో  హీరోయిన్గా నటించగా ... ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా  ... 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు , ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 న ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అందుకు అనుగుణం గానే చాలా వరకు అన్ని పనులను మేకర్స్ పూర్తి చేశారు. కానీ చివరి నిమిషం లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలు డిసెంబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు , ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 11 వ తేదీన ప్రదర్శించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ కి బుక్ మై షో  ఆప్ లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటి వరకు బుక్ మై షో ఆప్ లో ఈ మూవీ కి 320 కే ప్లస్ ఇంట్రెస్ట్ లు లభించాయి. 

ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. బుక్ మై షో  ఆప్ లో ఈ మూవీ కి జనాల నుండి దక్కుతున్న రెస్పాన్స్ ను బట్టి చూస్తేనే తెలుస్తుంది ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయి అనేది. ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ టాక్ ను తెచ్చుకుని ఏ స్థాయి కలెక్షన్లను చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: