- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

అఖండ 2 తాండ‌వం మోత తో ఏపీ, తెలంగాణ తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినీ ప్రేమికులు ఎక్క‌డ ఉంటే అక్క‌డ థియేట‌ర్లు మోగిపోతున్నాయి. అఖండ 2 ను బోయ‌పాటి ర‌క‌ర‌కాల థ్రెడ్స్ తో అల్లుకు పోవాల‌ని చూశాడు. సినిమాలో రాజ‌కీయం, ఆర్మీ, దైవం, సెంటిమెంట్‌, చైనా బ‌యోవార్ , హైంధ‌వ ధ‌ర్మం, క్షుద్ర‌త్వం ఇలా అన్నీ క‌లిసి క‌ట్టుగా మిక్స్ చేసి రాసుకున్న క‌థ‌నం కావ‌డంతో ఒక్కో చోట త‌లా తోక లేన‌ట్టుగా ముందుకు వెళుతుంది. సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక ఆది పినిశెట్టితో  అఘోరా క్యారెక్ట‌ర్ చేసే ఫైటింగ్ సీన్ సినిమా  గ్రాఫ్‌ను ఒక్క‌సారిగా హైప్‌న‌కు తీసుకువెళ్లింది. సెకండాఫ్‌పై గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్న వాళ్ల‌కు మాంచి బూస్ట్ ఇచ్చింది ఈ యాక్ష‌న్ సీక్వెన్స్‌.


సెకండాఫ్‌లో స‌నాత‌న ధ‌ర్మం, హైంద‌వం గురించి చెప్పిన డైలాగులు మాత్రం కేక పెట్టించేశాయి. సెకండాఫ్‌స్టార్ట్ అయ్యాక 40 నిమిషాల పాటు గూస్‌బంప్స్ మోత మోగిపోతుంది. యాక్ష‌న్‌సీక్వెన్స్  అయితే మాస్ జ‌నాల‌కు, బాల‌య్య - బ‌య‌పాటి మాస్ ఫైట్లు కోరుకునే వారికి మంచి జాత‌ర మోగించేశాయి. ఈ యాక్ష‌న్స్‌కు తోడుగా థ‌మ‌న్ బీజీఎంతో చావ‌కొట్టేశాడు. తెర‌మీద జ‌రుగుతున్న యాక్ష‌న్‌తంతును క‌ళ్ల‌ప్ప‌గించి చూడ‌డం మిన‌హా ఏం చేయ‌లేం. లాజిక్‌లు కాసేపు ప‌క్క‌న పెట్టేసి ఆ యాక్ష‌న్ సీన్స్ చూస్తూ ఉండిపోతాం.


అఖండ సినిమాలో జై బాల‌య్య సాంగ్ టైప్‌లోనే జాజికాయ సాంగ్ కాస్త ఉత్సాహం ఇచ్చినా జై బాల‌య్య అంత కిక్ ఇవ్వ‌లేదు. కుర్చీల‌తో వేసిన బాల‌య్య హుక్ స్టెప్ బాగుంది. జై బాల‌య్య సాంగ్ ఫ‌స్ట్‌టైం చూసిన వెంట‌నే మ‌రోసారి రీపీట్ అయితే బాగుంటుందే అనిపించినా జాజికాయ సాంగ్ ఆ రేంజ్‌లో లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: