- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నటసింహం నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ' అఖండ 2 ' తాండవం సినిమా విడుదలై మూడు రోజులైంది. ప్రేక్షకులలో మంచి స్పందన కనిపిస్తుండగా, కలెక్షన్లు షో షో కు క్ర‌మ క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌లో నిన్న రాత్రి జరిగిన చిత్ర విజయోత్సవ సభలో దర్శకుడు బోయపాటి శ్రీను ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం 'అఖండ 2' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు ఆయన ప్రకటించారు. సనాతన ధర్మం, భారతీయ మూలాలను ప్రతిబింబించే ఈ సినిమాను ప్రధాని మోదీ చూడబోతున్నారని బోయ‌పాటి తెలిపారు. మోడీ స్పెష‌ల్ షో చూస్తే నార్త్ ఇండియ‌న్ మార్కెట్లలో సినిమాకు అదనపు గుర్తింపు, ఆదరణ తీసుకువస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా ప్ర‌మోష‌న్ల లో భాగంగా సినిమా యూనిట్ యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ను సైతం క‌లిసింది.
మ‌రో వైపు నార్త్ ఇండియా లోనూ ఫ‌స్ట్ వీకెండ్ లో ఫ‌స్ట్ షో, సెకండ్ షోల‌కు అఖండ కు మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి.


మరోవైపు, బాక్సాఫీస్ వద్ద సినిమా నిలకడకు ఇదొక కీలక దశగా మారింది. తొలి వారాంతంలో మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం, సోమవారం నుంచి కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు ర‌ప్పిస్తే సినిమాకు మ‌రింత ప్ల‌స్ కానుంది. నైజాం లాంటి కీల‌క ఏరియాల్లో ఇప్ప‌టికే ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే నాటికే 70 % వ‌సూళ్లు వ‌చ్చేశాయి. ఈ పాన్ - ఇండియన్ బిగ్‌గీలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి, కబీర్ దుహాన్ సింగ్, హర్షాలీ మల్హోత్రా, పూర్ణ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. ఎస్.ఎస్. తమన్ అందించిన సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: