టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ఉండడం , ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో అత్యంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తి అయింది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఫైనల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ షూటింగ్ను డిసెంబర్ 19 వ తేదీ నుండి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రెండవ షెడ్యూల్ షూటింగ్ను దాదాపు 20 రోజుల పాటు కొనసాగించబోతున్నట్లు సమాచారం. ఈ రెండవ షెడ్యూల్లో ఈ మూవీ బృందం అత్యంత కీలక సన్నివేశాలను రూపొందించనున్నట్లు , ఈ రెండవ షెడ్యూల్లో ప్రకాష్ రాజ్ మూవీ షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమాతో పాటు మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ , హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ అనే సినిమాల షూటింగ్లలో కూడా పాల్గొంటున్నాడు. రాజా సాబ్ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: