నివేదా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటోని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఏఐ ఉపయోగించి అసభ్యకరంగా ఫోటోలను చిత్రీకరించి తప్పుదోవ పట్టించే విధంగా వైరల్ చేశారని, తన అనుమతి లేకుండా తన ఫోటోలను ఇలా మార్చడం అనేది కేవలం తప్పు మాత్రమే కాదు ఇది ఒక చట్ట విరుద్ధమైనటువంటి పని అంటూ తెలియజేసింది. ఇది తన గోప్యతకు భంగం కలిగించేలా ఉందంటూ ఫైర్ అయ్యింది. ఊరు పేరులేని కొన్ని అకౌంట్ల వెనుక దాక్కొని ఇలాంటి వికృత చేష్టలు చేసేవారు వెంటనే ఆ కంటెంట్ తొలగించాలంటూ ఆమె హెచ్చరించింది. లేనిపక్షంలో ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసింది నివేద థామస్. అలాగే నేటిజన్స్ ఎవరూ కూడా ఇలాంటివి లైక్స్ కామెంట్స్ చేయవద్దని అశ్లీలతను , తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహించడం కూడా నేరమే అంటూ తెలియజేసింది. ప్రస్తుతం నివేదా థామస్ చేసిన ఈ ప్రకటన సినీ వర్గాల నుంచి అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది.
గత కొద్ది రోజుల నుంచి డీప్ ఫేక్ బాధితురాలుగా చాలామంది హీరోయిన్స్ మారారు.. ఈ విషయం పైన చాలామంది అసహనాన్ని కూడా తెలియజేశారు ముఖ్యంగా ఏఐ దుర్వినియోగం సెలబ్రిటీలకే కాదు సాధారణ మహిళలను కూడా ఇబ్బంది పెడుతోంది. వీటికి సంబంధించి ప్రభుత్వాలు కూడా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటాయేమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి