గతంలో అమరావతి రాజధానిలో కూడా పర్యటన చేసిన సమయంలో బొలిశెట్టి సత్యనారాయణ పైన, మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కూడా చాలానే విమర్శలు చేశారు. ఏపీలో కాలుష్యానికి సంబంధించి దాఖలైన పిటిషన్ (PIL 248/2020) లో పిటీషనర్ గా ఉన్నారని ఈ నేపథ్యంలోనే తాను నైతిక విరామం తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ తెలియజేశారు. అలాగే ప్రభుత్వం పైన కేసు వేసిన వ్యక్తిగా, అదే ప్రభుత్వ కూటమిలో కీలకమైన నేతగా ఉన్న పార్టీలో ఉంటూ కీలకమైన పదవిలో ఉండడం సరైనది కాదు అని భావించానట్టు తెలిపారు. తన వల్ల ఎటువంటి విభేదాలు కూటమిలో రాకూడదని తాను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన నీరు, గాలి కోసం జరుగుతున్న న్యాయపోరాటం రాజకీయ కారణాలవల్ల ఎటువంటి ప్రభావితం చూపించకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. కోర్టులో సమస్యలన్నీ కూడా పరిష్కారమైన తర్వాత ఒకవేళ పార్టీ కోరుకుంటే మళ్లీ బాధ్యతలు చేపడతానని, జనసేన పార్టీ సిద్ధాంతాలకు కూడా తాను ఎప్పుడు కట్టుబడే ఉంటానంటూ లేఖలో తెలియజేశారు. మొత్తానికి జనసేన పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన బొలిశెట్టి పదవి నుంచి తప్పుకోవడంతో రాజకీయాలలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి