సాయి సింహాద్రి సైన్మా పతాకంపై నిర్మాత సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ... నిర్మించిన చిత్రం "S/O"(సన్ ఆఫ్). బత్తల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం టీజర్ ను శుక్రవారం విడుదల చేశారు.
దర్శకుడు సతీష్ మాట్లాడుతూ... "ఈ చిత్రం వినోద్ కుమార్ గారికి కం బ్యాక్ అవుతుంది. కచ్చితంగా ఆయన ఆల్బమ్ లో ఓ 'మామ గారు' చిత్రం లాగా ఈ సినిమా కూడా ఉండిపోతుంది. నేను చెప్పిన ప్రతి సన్నివేశానికి ఆయన ఒప్పుకుని ఎంతో స్ట్రాంగ్ గా నటించారు. మా హీరో సాయి సింహాద్రి కూడా నన్ను నమ్మి అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా చేశారు. ఆయనకోసం ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. కొడుకు తండ్రి మీద ఎందుకు కేసు వేశాడు అనేది చాలా స్ట్రాంగ్ గా చూపించాం" అన్నారు
హీరో సాయి సింహాద్రి మాట్లాడుతూ... " ఎప్పటి నుంచో ఇలాంటి కథను తెరమీద చూపించాలి అని వుంది.
ఈ కథ రియల్ లైఫ్ లో నాకూ,
మా నాన్నకు కనెక్ట్ అవుతుంది.
చాలా కథలు విన్నాను.
చివరకు ఈ కథకి కనెక్ట్ అయ్యాను.
ఈ కథ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటుంది.
ఇందులో డ్రామా,
ఎమోషన్ కూడా ఉంటుంది.
ప్రతి కొడుకు...
తన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది."
అన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ... '. సన్ ఆఫ్ మూవీ ఒక రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు..
ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ.
రెగ్యులర్ లైఫ్ లో ఓ తండ్రి,
కొడుకుల మధ్య సాగే స్టోరీ ఇది.
ఇందులో హీరోగా నటించినసాయి సింహాద్రి...
ఎక్కడో పర్లాకిమిడిలో చదివి...
అమెరికాకు వెళ్ళి...
అక్కడి నుంచి వచ్చి ఈ సినిమా తీశారు.
ఇది గ్రేట్ అచివ్ మెంట్.
దర్శకుడు సతీష్ 45
నిమిషాలు స్టోరీ ఎక్స్ట్రార్డినరీ గా నెరేషన్ చేశారు.
తన స్టోరీ విని మా అబ్బాయికి కూడా చెప్పాను....
తండ్రి కొడుకుల మధ్య సాగే ఒక మంచి స్టోరీ చెప్పాడని.
నేను వందకు పైగా సినిమాలు చేసిన అనుభవంతో చెబుతున్నా...
దర్శకుడు జీనియస్..
అతను దర్శకుడు పూరీ జగన్నాథ్ అభిమాని.
ఆయన ఎంతో కమిట్ మెంట్ తో ఈ సినిమా చేశారు.
కచ్చితంగా అందరికీ నచ్చుతుంది."
అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి