ప్రాచీన జపనీస్ కత్తి సాము కల" కేంజుట్సు "లో అధికారికంగా ప్రవేశం పొందడం వల్ల ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని పొందారు పవన్ కళ్యాణ్.. మూడు దశాబ్దాలకు పైగా క్రమశిక్షణతో సాగిన సాధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇష్టం ఎలాంటిదో చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వకముందే మార్షల్ ఆర్ట్స్ లో తన ప్రయాణం మొదలయ్యింది. ఈ మార్షల్ ఆర్ట్స్ లోనే పవన్ కళ్యాణ్ ఎన్నో ప్రతిష్టాత్మక గౌరవాలను కూడా అందుకున్నారు.
ఇప్పుడు జపాన్ సాంప్రదాయ యుద్ధ కళలలో "సోగో బుడో కన్రీ కై" గౌరవమైన సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు అక్కడి నుంచి ఫిఫ్త్ డాన్ పురస్కారం లభించింది పవన్ కళ్యాణ్ కి. అలాగే జపాన్ వెలుపల సోకే మురమత్సు సైన్స్ లో ఉండే టకేడా షింగెన్ క్లాసులో ప్రవేశం పొందిన మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా పేరు సంపాదించారు. ఇది జపాన్ లోని చాలా అరుదైన గౌరవంగా భావిస్తారు. అలాగే గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి కూడా తాజాగా పవన్ కళ్యాణ్ కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే ఒక విశిష్ట బిరుదు లభించింది. జపాన్ యుద్ధకళల అగ్రగన్యులలో ఒకరైన హన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్ముధీ వద్ద పవన్ కళ్యాణ్ శిక్షణ పొందారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఈ వీడియో అయితే వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి