మెగాస్టార్ చిరంజీవిని అందుకే 'అందరివాడు' అంటారు. ఆరు పదుల వయసులో కూడా ఆయన వేసే గ్రేస్ ఫుల్ స్టెప్పులకు చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు ఫిదా అవ్వాల్సిందే. 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో చిరంజీవి వేసిన సిగ్నేచర్ హుక్ స్టెప్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. సాధారణంగా యువకులు, రీల్స్ స్టార్స్ ఈ స్టెప్పులను అనుకరిస్తారు. కానీ, తాజాగా ఇద్దరు వృద్ధురాలు ఏకంగా మెగాస్టార్ రేంజ్‌లో ఊపుతూ వేసిన డ్యాన్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో.. ఇద్దరు బామ్మలు తమ ఇంటి ఆవరణలో 'మన శంకర వరప్రసాద్ గారు' పాట వినపడగానే ఆగలేకపోయారు. చిరంజీవి వేసిన ఆ కష్టమైన హుక్ స్టెప్‌ను అంతే ఈజ్‌తో, ఎంతో హుషారుగా వేశారు. ఆ వయసులో కూడా వారిలోని జోష్ చూస్తుంటే "మెగాస్టార్‌ను చూస్తే ఎవరికైనా పూనకాలు వస్తాయి" అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఆ బామ్మల డ్యాన్స్‌లో ఉన్న ఎనర్జీ చూసి సాక్షాత్తు మెగా అభిమానులే ఆశ్చర్యపోతున్నారు.


ఈ వీడియోను ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. "బామ్మలు ఇరగదీశారు", "మెగాస్టార్ పవర్ అంటే ఇదే", "వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని నిరూపించారు" అంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మెగా అభిమాన సంఘాలు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నాయి. చిరంజీవి స్వయంగా ఈ వీడియోను చూస్తే బాగుంటుందని, ఆయన కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో చిరంజీవిని ఎలాగైతే వింటేజ్ లుక్‌లో చూపించారో, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా అంతే మాస్ బీట్స్ ఇచ్చారు. ఈ సాంగ్ వింటే బాడీలో ఒక తెలియని వైబ్రేషన్ వస్తుంది. అందుకే చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ 'MSG' మేనియాలో మునిగిపోయారు. కేవలం ఈ పాట మాత్రమే కాదు, సినిమాలో చిరంజీవి చేసే కామెడీ, డైలాగ్ డెలివరీ కూడా బామ్మలకు బాగా నచ్చేశాయని సమాచారం.



2026 సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు పోటీ పడ్డాయి. కానీ, 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా మాత్రం వసూళ్ల పరంగానే కాకుండా, ప్రజల మనసు గెలుచుకోవడంలో కూడా టాప్ లో నిలిచింది. అమెరికాలో 2.2 మిలియన్ డాలర్ల మార్కును దాటేసి, ఇటు తెలుగు రాష్ట్రాల్లో బామ్మల డ్యాన్స్‌లతో ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతోంది.మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి మేనియా వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఆవహించేసింది. ఈ బామ్మల డ్యాన్స్ వీడియో 'MSG' సినిమా సక్సెస్‌కు ఒక మచ్చుతునక. బాస్ సినిమా అంటే పండగే.. అది బామ్మల డ్యాన్స్‌తో మరోసారి ప్రూవ్ అయ్యింది!



మరింత సమాచారం తెలుసుకోండి: