సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార పేరు ఇప్పుడు మరోసారి గట్టిగా వినిపిస్తోంది. ఆమె కెరీర్, కథల ఎంపిక, పాత్రల స్వభావం గురించి సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన మనశంకర్ వరప్రసాద్  సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలవడంతో, నయనతార క్రేజ్ మరో లెవల్‌కు వెళ్లింది అని చెప్పాలి.

పెళ్లి తర్వాత నయనతార కెరీర్‌పై చాలా రకాల అభిప్రాయాలు వినిపించాయి. కొందరు “పెళ్లి తర్వాత ఆమెకు పెద్ద హిట్ పడలేదు” అని మాట్లాడితే, మరికొందరు మాత్రం “ఆమె పాత్రల ఎంపికే మారిపోయింది” అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ తాజా సినిమా విజయం నయనతార ఖాతాలో పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ పర్ఫెక్ట్ హిట్‌గా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ సక్సెస్‌తో మరోసారి ఆమె తన స్టామినాను ప్రూవ్ చేసుకుంది.

ఇలాంటి సక్సెస్ మూడ్‌లోనే సోషల్ మీడియాలో నయనతార కథల ఎంపిక గురించి కొన్ని ఫన్నీ కానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె కథ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందని, స్క్రిప్ట్ లేకుండా అస్సలు ఓకే చెప్పదని అంటున్నారు. కానీ మరో వర్గం మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా మాట్లాడుతోంది.వారి మాటల్లో చెప్పాలంటే…డైరెక్టర్ నయనతారను కలిసినప్పుడు మూడు విషయాలు క్లియర్‌గా చెబితే చాలు, ఆమె ఆ సినిమాకి కచ్చితంగా ఓకే చెబుతుందట. అవేంటంటే —

*భర్తను వదిలేసే లేదా భర్తకు దూరంగా ఉండే క్యారెక్టర్

*పిల్లల తల్లీగా సింగిల్‌గా ఉండి తన జీవితం తానే లీడ్ చేసే పాత్ర

*ఒక మహిళ తన కాళ్ల మీద తాను నిలబడాలి, ఆమె శక్తిని, స్వతంత్రతను చూపించే కథ

ఈ మూడు అంశాల్లో ఏదైనా ఒకటి లేదా మూడు కలిపి ఉంటే నయనతార ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఫన్నీగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది నిజమో కాదో తెలియదు కానీ, ఆమె గత సినిమాల్ని గమనిస్తే మాత్రం ఈ మాటల్లో కొంత నిజం ఉందేమో అనిపిస్తోంది.దీనికి ఉదాహరణగా ఇటీవల వచ్చిన మనశంకర్ వరప్రసాద్ సినిమా మాత్రమే కాదు, అంతకుముందు వచ్చిన “విశ్వాసం” వంటి సినిమాల్నీ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఆ సినిమాల్లోనూ నయనతార పాత్ర బలంగా, స్వతంత్రంగా, మహిళా శక్తిని ప్రతిబింబించే విధంగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. అందుకే ఆమె వరుసగా ఇలాంటి కథలకే ఓకే చెబుతోందని కొందరు అంటున్నారు.

అయితే ఇక్కడే ఫ్యాన్స్ మధ్య మరో డిబేట్ మొదలైంది.“నయనతార ఇలాంటి పాత్రలకే పరిమితమవడం ఎంతవరకు కరెక్ట్?”..“ఆమె మరో రకం క్యారెక్టర్స్ ట్రై చేయాలా?”..“కమర్షియల్, గ్లామర్ లేదా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆమెను మళ్లీ చూడగలమా?”..అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. నయనతార లాంటి స్టార్ హీరోయిన్‌కు పాత్రల పరంగా చాలా ఆప్షన్స్ ఉన్నా, ఆమె ఒకే రూట్‌లో వెళ్తుందా? లేక త్వరలోనే తన ఇమేజ్‌ని బ్రేక్ చేస్తూ పూర్తిగా కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అనేది చూడాలి.మొత్తానికి, నయనతార సినిమాల ఎంపికపై ఈ మూడు మాటల థియరీ ఇప్పుడు టాలీవుడ్‌లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఇది కేవలం ఫన్నీ టాక్‌గానే మిగులుతుందా, లేక నిజంగా ఆమె కెరీర్ స్ట్రాటజీని ప్రతిబింబిస్తుందా అనేది కాలమే చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం నిజం — నయనతార పేరు వినిపిస్తే చాలు, ఆ సినిమా చర్చలోకి రావడం మాత్రం గ్యారెంటీ.


మరింత సమాచారం తెలుసుకోండి: