నిజానికి మార్చి 27న రామ్ చరణ్ 'పెద్ది' విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే మరియు ఇతర కారణాల వల్ల 'పెద్ది' రేసు నుంచి తప్పుకోవడంతో, ఆ ఖాళీని భర్తీ చేసేందుకు 'ఉస్తాద్' సిద్ధమయ్యారు.మార్చి 27 చరణ్ పుట్టినరోజు. ఆ రోజున అబ్బాయి సినిమా రాకపోయినా, బాబాయ్ పవన్ కళ్యాణ్ తన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవతారంతో థియేటర్లకు రాబోతుండటం విశేషం.రెండు సినిమాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, 'పెద్ది' వాయిదా పడటంతో హరీష్ శంకర్‌ను పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం చేయమని కోరారట.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటేనే ఒక ఊపు ఉంటుంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ రికార్డులు సృష్టించగా, ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఈ పాట కోసం పవర్‌ఫుల్ లిరిక్స్ అందించారు. పవన్ కళ్యాణ్ 'ఆరా'ను ఎలివేట్ చేసేలా ఈ పాట ఉంటుందని, ఇది పక్కా మాస్ సాంగ్ అని టాక్. డీఎస్పీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే పెద్ద అసెట్ కాబోతోంది.రీసెంట్‌గా విడుదలైన పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ ఒక చేతిలో షాట్‌గన్, మరో చేతిలో వింటేజ్ రేడియో పట్టుకుని కనిపిస్తున్నారు.
"ఈ లుక్ చూస్తుంటే గబ్బర్ సింగ్ నాటి మాస్ వైబ్స్ గుర్తొస్తున్నాయి. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు తోడైతే థియేటర్లలో రచ్చ రంబోలానే!" అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో పవన్ ఒక విభిన్నమైన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు.సినిమా రిలీజ్ కాకముందే 'ఉస్తాద్' రికార్డులు మొదలుపెట్టాడు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డీల్స్.గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన జోడీ కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.
ఏపీ డెప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ కావడంతో సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్‌లోని మాస్ యాంగిల్‌ను ఎలా వాడాలో హరీష్ శంకర్‌కు బాగా తెలుసు. "భగత్ సింగ్.. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాదు.. అది గుర్తుపెట్టుకో" వంటి డైలాగులు ఇప్పటికే వైరల్ అయ్యాయి.మొత్తానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి సిద్ధమవుతోంది. మార్చి 27న పవర్ స్టార్ గర్జన వినడానికి టాలీవుడ్ వెయిట్ చేస్తోంది. బాబాయ్ వస్తున్నాడు.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి