చిరంజీవి మాట్లాడుతూ …“అమ్మ, అన్నం లాగే సక్సెస్ కూడా ఎప్పటికీ బోర్ కొట్టదు. ప్రేక్షకుల ప్రేమే నా బలం. జీవితాంతం వారిని అలరిస్తూనే ఉంటాను” అంటూ తన అభిమానులపై ఉన్న ప్రేమను మరోసారి వ్యక్తం చేశారు. తన సినీ ప్రయాణం, ప్రేక్షకులతో ఉన్న అనుబంధం గురించి భావోద్వేగంగా మాట్లాడారు.ఇక కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలే. ఈ అంశంపై చాలా క్లియర్‌గా, స్ట్రైట్‌గా స్పందించిన మెగాస్టార్…“సినీ పరిశ్రమ ఒక అద్దంలాంటిది. మనం ఎలా ప్రవర్తిస్తే, రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ప్రొఫెషనల్‌గా పనిచేసేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు” అని వ్యాఖ్యానించారు.
పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే వ్యవస్థ లేదని, అలాంటి ఆరోపణలకు తావు లేదని చిరంజీవి స్పష్టం చేశారు. నిజాయితీగా, క్రమశిక్షణతో, ప్రొఫెషనల్‌గా పనిచేసే వారికి పరిశ్రమలో ఎప్పుడూ అవకాశాలు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా ఫ్రెష్ టాలెంట్‌కు ఇండస్ట్రీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని, వారిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని అన్నారు.“కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరిదీ. టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయి. ఇండస్ట్రీ ఎవరికీ శత్రువు కాదు” అని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సభలో పెద్ద చప్పట్లను అందుకున్నాయి. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అంతేకాకుండా ఈ సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన వెంకటేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనతో కలిసి నటించిన నయనతారపై ప్రశంసలు కురిపిస్తూ, ఆమె ప్రొఫెషనలిజం, నటన సినిమాకు మరింత బలమిచ్చాయని అన్నారు.దర్శకుడు అనిల్ రావిపూడి గురించి మాట్లాడుతూ…“కామెడీ, ఎమోషన్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేసి సినిమాను తెరకెక్కించారు. ప్రేక్షకులు ఇంతగా ఆదరించడానికి ఆయన కథనశైలి ప్రధాన కారణం” అని ప్రశంసించారు. అలాగే సినిమా ఎడిటర్ తమ్మి రాజుకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
మొత్తానికి, “మన శంకరవరప్రసాద్ గారు” సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయన అనుభవానికి, వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచాయి. ఒకవైపు సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేస్తూనే, మరోవైపు ఇండస్ట్రీపై తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడం ద్వారా చిరంజీవి మరోసారి వార్తల్లో నిలిచారు.ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఎలాంటి చర్చలకు దారి తీస్తాయో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం…మెగాస్టార్ మాట అంటే మామూలు మాట కాదు – అది ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేసే మాటే!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి