ఇక ఈ సినిమా తర్వాత కూడా దర్శకుడు బాబీకి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయట. చిరంజీవి సినిమాతో పాటు మరో పెద్ద హీరోతో కూడా సినిమా కమిట్ అయ్యాడని టాక్. ప్రస్తుతం చిరంజీవి సినిమా షూటింగ్ ఫాస్ట్ పేస్‌లో జరుగుతుంది అని సమాచారం.ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై మొదటినుంచి భారీ చర్చ జరుగుతోంది. తొలుత హీరోయిన్‌గా ప్రియమణిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే చిరంజీవి కూతురు పాత్ర కోసం క్రితి శెట్టి ఎంపికయ్యిందన్న వార్త కూడా అప్పట్లో వైరల్ అయింది. అయితే తాజాగా ఈ విషయంలో అనూహ్యమైన ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
క్రితి శెట్టి ఈ పాత్రకు పూర్తిగా సెట్ కావడం లేదని దర్శకుడు బాబీ భావించాడట. ప్రతి నటుడు ప్రతి పాత్రకు సూట్ అవుతాడని కాదు అన్న ఆలోచనతో, ఈ కూతురు పాత్రకు మరింత బలమైన నటన కలిగిన హీరోయిన్ అవసరమని ఆయన నిర్ణయించుకున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అందుకే ఆ పాత్రను మరో స్టార్ హీరోయిన్‌కు అప్పగించినట్లు సమాచారం.ఆ హీరోయిన్ మరెవరో కాదు… ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్‌లో ఉన్న శ్రీలీల. భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణకు కూతురుగా నటించి, తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీలీల, ఆ పాత్రతో ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆమె పెర్ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి.
అదే నమ్మకంతో, చిరంజీవి సినిమాలో కూడా కూతురు పాత్రకు శ్రీలీల అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని బాబీ భావించాడట. దీంతో చివరికి శ్రీలీలనే ఫైనల్ చేశారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.శ్రీలీల చిరంజీవికి కూతురా? ఇదేంటి అనుకుంటున్నారు అభిమానులు. ఎందుకంటే ఒకవైపు రామ్ చరణ్ పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశాలు వస్తున్న సమయంలో, అదే రామ్ చరణ్ తండ్రి అయిన చిరంజీవికి కూతురుగా శ్రీలీల నటిస్తుందా? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో డిస్కషన్‌గా మారింది.
కొంతమంది అభిమానులు ఇది పూర్తిగా నటన మాత్రమే అని, పాత్రకు వయసు, నటన ముఖ్యం కానీ రియల్ లైఫ్ ఏజ్ గ్యాప్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కొంతమంది మాత్రం ఇది కాస్త డిఫరెంట్‌గా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, ఈ కాంబినేషన్ మాత్రం సినిమాపై ఆసక్తిని మరింత పెంచిందన్నది మాత్రం నిజం.మొత్తానికి బాబీ – చిరంజీవి సినిమా ఇప్పటికే భారీ అంచనాలతో ముందుకు సాగుతుండగా, శ్రీలీల ఎంట్రీతో ఆ అంచనాలు మరో లెవెల్‌కు వెళ్లాయి. అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు నిజం ఏంటో తేలదు కానీ, అప్పటివరకు ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి