సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం… అక్కడ ప్రేమకథలు పుట్టడం, పుష్పించటం, మాయమవటం అన్నీ చాలా సహజం. ముఖ్యంగా టాలీవుడ్‌లో అయితే “లవ్ బర్డ్స్”కి కొదవే లేదు. పూటకో కొత్త జంట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే, మరో పూటకే బ్రేకప్ వార్తలు వినిపిస్తుంటాయి. ఇదంతా ఇప్పుడు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. అయినా సరే, ప్రతి సారి కొత్త జంట కనిపిస్తే ఆ ఉత్సుకత మాత్రం తగ్గదు. ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన చర్చే టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో యంగ్ హీరో – యంగ్ హీరోయిన్ జంట ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఇద్దరూ టాలీవుడ్‌కే చెందిన వారు, కెరీర్‌లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న కొత్త తరహా స్టార్స్. వీరిద్దరూ కలిసి చేసిన తొలి సినిమా ఊహించని స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అవడంతో, వీరి కెమిస్ట్రీపై అప్పట్లోనే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తెర మీద మాత్రమే కాదు, తెర వెనుక కూడా వీరి మధ్య ఏదో ప్రత్యేకమైన బాండింగ్ ఉందన్న టాక్ అప్పుడే మొదలైంది.

ఆ హిట్‌కు కొనసాగింపుగా ఇప్పుడు ఈ జంట మరో సినిమా కోసం మళ్లీ కలిసి పని చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ సెట్స్‌లో వీరి వ్యవహారం చూసిన వాళ్లకు అనుమానం రావడం సహజమే అంటున్నారు సినీ వర్గాలు. షూటింగ్ షాట్స్ పేరుతో ఇద్దరూ చాలా క్యూట్‌గా, చాలా క్లోజ్‌గా టైమ్ స్పెండ్ చేస్తున్నారట. ఒకరితో ఒకరు సరదాగా జోకులు వేసుకోవడం, నవ్వుతూ మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు ఒకరిపై ఒకరు వాలిపోవడం, గిల్లుకోవడం, ఆటపట్టించుకోవడం… ఇవన్నీ అక్కడ ఉన్న యూనిట్ సభ్యులకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయట.ఇవన్నీ చూసిన అభిమానులు, నెటిజన్లు “వీళ్ల మధ్య ఖచ్చితంగా ఏదో ఉంది” అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టేశారు. రాత్రి కాదు, పగలు కాదు… జిల్ జిల్ జిగా అంటూ ఇద్దరూ సెట్స్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. నిజంగా ఇది నటనకే పరిమితమా? లేక నిజ జీవిత ప్రేమకూ ఇది సంకేతమా? అనే ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి.

కొంతమంది అభిమానులు మాత్రం బాగా ఎమోషనల్ అయిపోతున్నారు. “ఇది నిజమైన ప్రేమ అయితే, మరికొద్ది రోజుల్లోనే పెళ్లి వార్త కూడా చెప్పేస్తారేమో” అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో అరుదుగా కనిపించే జెన్యూన్ లవ్ స్టోరీగా ఇది మారాలని కోరుకుంటున్నారు. హీరో–హీరోయిన్ మాత్రమే కాదు, వారి కుటుంబాలూ ఒప్పుకుని, ఈ కథ హ్యాపీ ఎండింగ్‌తో ముగిస్తే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు.అయితే మరో వర్గం మాత్రం చాలా రియలిస్టిక్‌గా, కాస్త ఘాటుగా స్పందిస్తోంది. “ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్. షూటింగ్ సమయంలో ఇలా క్లోజ్‌గా ఉండటం, కెమిస్ట్రీ చూపించడం ప్రొఫెషనల్ అవసరం. సినిమా పూర్తయిపోయాక నీ దారి నీది, నా దారి నాది అంటూ చేతులు దులుపుకుని వెళ్లిపోతారు” అని అంటున్నారు. ఇంతకుముందు కూడా ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చూశామని, కాబట్టి ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

మరి నిజం ఏంటి? ఈ టాలీవుడ్ లవ్ బర్డ్స్ తమ స్నేహాన్ని, ప్రేమను నిజంగా జీవితాంతం ముందుకు తీసుకెళ్తారా? లేక ఇది కూడా షూటింగ్ సెట్స్ వరకే పరిమితమైన ఓ అందమైన ఎపిసోడ్గా మిగిలిపోతుందా? అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. ఈ వ్యవహారంపై హీరో, హీరోయిన్ ఇద్దరూ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అందుకే ఊహాగానాలు, కథనాలు మరింతగా పెరుగుతున్నాయి.ఏదేమైనా, ఈ యంగ్ జంటపై ప్రస్తుతం టాలీవుడ్ చూపు మొత్తం పడింది. వారి సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తితో పాటు, వారి రిలేషన్‌షిప్‌పై కూడా అభిమానులు నిశితంగా గమనిస్తున్నారు. ఇది నిజమైన ప్రేమకథగా మారుతుందా, లేక ఇండస్ట్రీలోని మరో సాధారణ కథగా మిగిలిపోతుందా… అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం కాలమే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: