యాంకర్ శ్రీముఖి బుల్లితెర పైనే కాకుండా సినిమా ఆడియో ఫంక్షన్లకు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు సైతం చేస్తూ భారీ గానే సంపాదిస్తోంది. ప్రస్తుతం ఒక్కో షోకి ఈవెంట్ కి శ్రీముఖి దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లేదా ఏదైనా ఫంక్షన్లకు హోస్ట్ గా చేయాలి అంటే రూ.2 లక్షల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం శ్రీముఖి ఈ టీవీ, స్టార్ మా వంటి చానెల్స్ లో పలు ప్రోగ్రామ్స్ కి హొస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
అలా కనీసం మూడు నుంచి నాలుగు షోలకు హోస్టుగా చేస్తోంది. దీంతో ప్రతి నెల శ్రీముఖి ఆదాయం సుమారుగా 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పవచ్చు. ఇక శ్రీముఖికి ప్రస్తుతం ఉన్న క్రేజ్ భారీగా ఉండడంతో నిర్మాతలు శ్రీముఖినే కావాలని ఏరుకోరి మరి ఎంచుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు రకాల బ్రాండ్ ప్రమోషన్స్ చేయడమే కాకుండా, ఒక్కో బ్రాండ్ ప్రమోషన్స్ కోసం లక్షలలో తీసుకుంటున్నట్లు టాకు వినిపిస్తోంది. ప్రస్తుతం బుల్లితెర యాంకర్లలో టాప్ ప్లేస్ లో ఉన్నది శ్రీముఖి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి