టీజర్ విషయానికి వస్తే.. నరకం నుంచి సందేశం వస్తుంది ఇది మన ఊరికి శాపం అనే ఒక సీరియస్ డైలాగ్ తో మొదలవుతుంది.. ఆ తర్వాత అమెరికా నుంచి వచ్చిన ఒక యువకుడు తన సొంత ఊరిలో పాత బంగ్లాలో (సంగీత్ శోభన్) చిక్కుకోవడం, అక్కడ అతనికి ఎదురైన కొన్ని అనుభవాలు ఏంటి? ఆ ఊరికి ఉన్నటువంటి శాపం వెనుక రహస్యం ఏంటి? అనేది ఈ సినిమా కథ అన్నట్లుగా టీజర్ లో చూపించారు. ఒకవైపు భయపడుతూనే మరొకవైపు సంగీత్ శోభన్ తన కామెడీ టైమింగ్ తో మరింత ఇంట్రెస్టింగ్గా టీజర్ కొనసాగించేలా చేశారు.
ఈ చిత్రానికి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తోంది. అనిదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సంగీత్ శోభన్ కి జోడిగా నయన్ సారిక హీరోయిన్గా నటిస్తోంది. అలాగే తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితర నటీనటులు ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. మరి హర్రర్ కామెడీ జోనర్ లో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. రాకాస సినిమా ట్రైలర్ కోసం కూడా అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం టీజర్ వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి