ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు విజయ్ సంగీత విడాకుల మ్యాటరే వైరల్ అవుతుంది. కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి పై తన భార్య సంగీత సంచలన ఆరోపణ చేసింది. చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విజయ్ తో విడాకులు కావాలని కోరుతూ విడాకులకు గల కారణాన్ని కూడా అందులో బయటపెట్టింది. చాలా రోజుల నుండి నా భర్త ఒక నటితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని, ఎన్ని సార్లు చెప్పిన మళ్లీ అదే పని చేయడంతో విసిగిపోయిన నేను ఆయనతో విడాకులు కోరుతున్నాను అంటూ అందులో ఒక స్ట్రాంగ్ రీజన్  చెప్పింది. దీంతో ఈ విషయం కాస్త మీడియాలో వైరల్ అయింది.విజయ్ సంగీత విడాకులకు సంబంధించిన మ్యాటర్ సోషల్ మీడియాలో ఇంత వైరల్ అయినప్పటికీ అటు విజయ్ గానీ ఇటు సంగీత గానీ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా దీనిపై స్పందించలేదు.

 ఇదిలా ఉంటే తాజాగా ఓవైపు భార్య విడాకుల నోటీసు పంపిస్తే మరోవైపు కొడుకు విజయ్ దళపతికి పెద్ద షాక్ ఇచ్చాడు. అదేంటంటే.. భార్యతో విడాకుల విషయం గురించి సఫర్ అవుతున్న విజయ్ కి కొడుకు జాసన్ పెద్ద షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది.విజయ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని జాసన్ అన్ ఫాలో చేశారని,అలాగే విజయ్ ఫాలోయింగ్ లిస్టులో కొడుకు పేరు లేదు అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ చేస్తున్నారు. మరి నిజంగానే విజయ్ ఇంస్టాగ్రామ్ ఖాతాని కొడుకు అన్ఫాలో చేశారా..

విజయ్ ని కొడుకు కూడా అసహ్యించుకుంటున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ విడాకుల విషయంలో సఫర్ అవుతున్న విజయ్ కి కొడుకు చేసిన పని పుండు మీద కారం చల్లినట్టు ఉంది అని ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన మ్యాటర్ వైరల్ గా మారి ఇది నిజమే అని అందరూ భావిస్తున్నారు. ఇక తమిళనాడులో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్న సమయంలో సంగీత ఇచ్చిన షాక్ మాత్రం విజయ్ కి కోలుకోలేని దెబ్బ కొట్టింది అని చెప్పుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: