హీరో విశాల్ నటించిన వేటాడు వెంటాడు సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. తమిళంలో సమర్ పేరుతో నిర్మించిన సినిమాను తెలుగులో వేటాడు వెంటాడు పేరుతో విడుదల చేస్తున్నారు. తిరు దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో శ్రీనివాస్ దామెర విడుదల చేస్తున్నారు. విశాల్ కెరీయర్ లో అత్యంత భారీ గా నిర్మించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. సునయన, మనోజ్ బాజ్ పాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. విశాల్-త్రిష తొలిసారిగా కలిసి నటించిన ‘వేటాడు వెంటాడు’ సినిమా విజయంపై చిత్ర యూనిట్ చాలా ధీమాగా ఉంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: