ఆ మధ్య ‘పూలరంగడు’లో సిక్స్ ప్యాక్ బాడీతో అలరించాడు సునీల్, త్వరలో రాబోతున్న ‘మిస్టర్ పెళ్లికొడుకు’ చిత్రంలోనూ మరోసారి తన బాడీ ప్రదర్శన చేయబోతున్నాడని సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. తన కండల్ని మరోసారి మెరిపించుకునేందుకు ప్రస్తుతం సునీల్ జిమ్ కి వెళ్తున్నాడట, ఇంతకుముందు సిక్స్ ప్యాక్స్ ని తయారుచేసిన ట్రైనర్ నే మరోసారి సంప్రదించాడట. తదనుగుణంగా మరోసారి ఆహార విహారాల్లోనూ మార్పులు చేసుకున్నాడట. సునీల్ కి బాడీ కూడా ఓ సెంటిమెంటుగా మారిందని పలువురు చెప్పుకుంటున్నారు. పూలరంగడు మాదిరిగానే ఈ చిత్రమూ మాంచి హిట్ కావాలనే ఈ బాడీ సెంటిమెంటును సునీల్ ఫాలో అవుతున్నాడని అతని స్నేహితులు కొందరు చెప్పుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: