మరోవారసుడి వెండి తెరంగేట్రానికి రంగం సిద్ధమౌతోంది. అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ సినిమాల్లోకి వచ్చే రోజులు దగ్గరపడ్డాయని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం అఖిల్ అమెరికాలో చదువుకుంటున్నాడు. వీలున్నప్పుడల్లా సార్ట్ మూవీస్ లో నటిస్తున్నాడట. అంతేకాదు, ఓ ప్రముఖ దర్శకుడు కూడా అఖిల్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాడట.  వివిధ రసాల్లో నటిస్తున్నప్పుడు అఖిల్ ఎలా ఉంటాడో తెలుసుకునేందుకే ఈ షూట్ నిర్వహించారని సమాచారం. మొత్తానికి అఖిల్ తెరంగేట్రానికి కసరత్తు మొదలైందని మాత్రం స్పష్టంగా అర్థమౌతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: