నందమూరి ఫ్యామిలీ హీరో తారక రత్న కొత్త సినిమా ప్రారంభమయ్యింది. విజేత పేరుతో రూపొందే ఈ సినిమాలో శ్వేతాబసు ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా, నందమూరి ఇప్పడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. దయ అనే సినిమాలో నటిస్తున్నాడు. పొనుగంటి రాజారెడ్డి దర్శకత్వంలో పోలీస్ ఆఫీసర్ గా ఒక సినిమాలో నటిస్తున్నాడు. అలాగే వీరూ.కె రూపొందిస్తున్న మైక్ టెస్టింగ్ 123 సినిమాలోనూ నటిస్తున్నాడు.
ప్రస్తుతం ఇలా వరస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. దీంతో ఇన్ని సినిమాల్లో ఒక్కటైనా హిట్ అవ్వక పోతుందా అని తారక రత్నఇన్నీ సినిమాలు చేస్తున్నాడా... లేక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలని తారక రత్న భావిస్తున్నాడా.. అని ఫిల్మ్ నగర్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: