బిగ్ బాస్ లో ఫీమేల్ కంటెస్టంట్ హరితేజ అందరికి తెలుసు.. అంతకుముందు సీరియల్స్ ఆ తర్వాత సినిమాలు చేస్తూ వచ్చిన హరితేజ బిగ్ బాస్ సీజన్ వన్ లో యాక్టివ్ కంటెస్టంట్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ వన్ లో ఆమె చెప్పిన బుర్ర కథ అందరికి నచ్చేసింది.  


అందుకే హరితేజ ఉన్న రాజా ది గ్రేట్ సినిమాలో ఆమె బుర్ర కథని చూపించారు. సినిమాలో హీరోయిన్ పిన్నిగా నటించిన హరితేజ అందులో పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర చేయకపోయినా బిగ్ బాస్ షోతో రిజిస్టర్ అయ్యింది కాబట్టి అందరికి కనెక్ట్ అయ్యింది. ఇక సినిమా ఎండ్ కార్డ్ లో ఆమె బిగ్ బాస్ లో చెప్పిన బుర్ర కథ ఎపిసోడ్ ను ఓ 10 సెకన్ల పాటు చెప్పించి ముగింపు చెప్పేశారు. 


అలా బిగ్ బాస్ లో ఆమె కథ ఎంత బాగా క్రేజ్ తెచ్చుకుందో అర్ధమవుతుంది. ఇక సినిమా విషయానికొస్తే మాస్ మహరాజ్ రవితేజ సత్తా చాటుతూ రాజా ది గ్రేట్ కలక్షన్స్ వస్తున్నాయి. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను అనీల్ రావిపుడి డైరెక్ట్ చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా దిల్ రాజు సక్సెస్ మేనియాను కంటిన్యూ చేస్తుంది.


పటాస్, సుప్రీం తో పాటుగా రాజా ది గ్రేట్ సినిమాతో కూడా హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నాడు అనీల్ రావిపుడి. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మాస్ రాజా ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది. సినిమాలో రవితేజ బ్లైండ్ మేన్ గా కనిపించి అలరించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: