అక్కినేని నాగార్జనకు ఆయన మేనల్లుడు సుమంత్‌కు మధ్య చాల గ్యాప్ ఏర్పడింది అన్న గాసిప్పులు ఇండస్ట్రీ వర్గాలలో ఎప్పటి నుంచో హడావిడి చేస్తున్నాయి. ఈవిషయాలను అనేకసార్లు ఇప్పటికే నాగార్జున సుమంత్ లు ఓపెన్ గా ఖండిస్తూ వచ్చారు. అయితే ఒకనాటిలా వీరిద్దరూ సన్నిహితంగా కనిపించట్లేదన్నది ఓపెన్ సీక్రెట్. 
Nani and Nagarjuna in Devadas
దీనికితోడు సుమంత్ సినిమాల విషయంలో నాగార్జున పెద్దగా పట్టించుకోక పోవడమే కాకుండా అతడి సినిమాలు విడుదల అయినప్పప్పుడు నాగార్జున ఆ సినిమాలను ప్ర్రసంసిస్తూ కామెంట్స్ చేసిన సందర్భాలు కూడ ఈమధ్య లేవు. ఈమధ్యకాలంలో ఒకే ఫ్యామిలీలో పలువురు హీరోల సంఖ్య పెరిగిపోవడంతో ఆకుటుంబ హీరోల సినిమాల మధ్య పోటీ విపరీతంగా ఉంటున్న నేపధ్యంలో ఒక కుటుంబ హీరో సినిమా పై అదే కుటుంబ హీరో సినిమా పోటీగా విడుదల కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
Sumanth New Movie Title Idam Jagath - Sakshi
ఇలాంటి పరిస్థుతులలో ఇప్పుడు అక్కినేని నాగార్జున సినిమాకు పోటీగా సుమంత్ నటించిన మూవీ పోటీగా విడుదల అవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. నాగార్జున నానీలు కలిసి నటించిన 'దేవదాస్' సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది.  ఈసినిమా విడుదల తేదీని చాలా రోజుల క్రితమే నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు సుమంత్ హీరోగా నటించిన 'ఇదం జగత్' సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాతలు ప్రకటించడం ఆశ్చర్యకరంగా మారింది. 
Sumanth Mahesh Babu Friendship Relation Feedback Movies
ఇలా ఒక్కరోజు గ్యాప్ లో వీరిద్దరు సినిమాలు విడుదల అవుతున్న నేపధ్యంలో ఇది మామా అల్లుళ్ళ సవాలుగా మారింది. ఇప్పటికే విడుదలైన 'ఇదం జగత్' ట్రైలర్ ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.  ఈ సినిమా హాలీవుడ్ చిత్రం 'నైట్ కాలర్' కు అనుసరణ అనే టాక్ కూడ ఉంది. ఇక నాగ్ 'దేవదాస్' పై కూడ అంచనాలు బాగా ఉన్న నేపధ్యంలో నిజంగానే ఈమామ అల్లుళ్ళ సవాల్ జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: