అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కు తిరుపతి వెంకన్న సన్నిధానం దగ్గరలో ఓ సంగీత కళాశాలను స్థాపించాలనే కోరిక బలంగా ఉండేది. సంగీత సరస్వతిని ప్రతి ఒక్కరికి అందుబాటులో కి తేవాలని ఘంటసాల ద్యేయం.  సంగీతం నేర్చుకోవాలని తపనతో వచ్చే పేదవారికి ఉచిత బోజనం,వసతులుతో పాటు సంగీతాన్ని నేర్పించాలనేది ఘంటసాల కోరిక. కళాశాల కోసం ఎన్నో కలలు కన్నారు ఆయన, తన సంపాదనలో కొంత భాగాన్ని సంగీత కళాశాలకు కెటాయించాలని ఎప్పడు కప్పడు అనుకోనే వారు.  ఆలా కొంత నగదు ను పొదుపు చేసి తిరుపతిలో స్థలాన్ని కొన్నారు కూడా. కానీ ఆయన మరణీంచే నాటికి సంగీత కళాశాల నిర్మించాలన్న కోరిక నేర వేరకుండనే దివంగతులయ్యారు ఘంటసాల. అమర గాయకుడు మరణీంచే నాటికి వారి కటుంబ ఆర్ధిక పరిస్థితి బాగా లేక పోవటంతో వారి కుటుంబ సభ్యులు తిరుపతి లోని ఆ స్థలాన్ని అమ్మివేశారు.  దీంతో ఘంటసాల కోరిక నేరవేర కుండా పోయింది. ఇప్పటికైనా ఘంటసాల అభిమానులు అందరూ కలసి ఘంటసాల పేరు మీద తిరుపతి లో సంగీత విధ్యాలయాన్ని నిర్మింస్తే ఆయన కోరిక నేరవేరినటే ?  

మరింత సమాచారం తెలుసుకోండి: