ప్రముఖ యాంకర్, నటి ఝాన్సీ నిర్మాతగా మారారు. ‘ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్రీథింగ్’ అనే ఆంగ్ల చిత్రాన్ని నిర్మించారు. అమ్మాయిల మధ్య స్నేహం అనే అంశాన్ని తీసుకుని ఈ సినిమాను నిర్మించారట. 62 నిమిషాల నిడివిగల ఈ చిత్రాన్ని త్వరలో అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ కీ పంపించాలని భావిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే... కెమెరామేన్, ఎడిటర్ మినహా ఈ చిత్రానికి అందరూ మహిళా టెక్నీషియన్లే పనిచేశారు. ‘దీన్లో మూడే పాత్రలుంటాయి. ముగ్గురమ్మాయిల మధ్యన తలెత్తిన ఒక సమస్యను ఎలా పరిష్కరించుకున్నారన్నదే ప్రధానాంశం’ అని ఝాన్సీ వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: