‘దేనికైనా రెడీ’ సినిమా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమాలో బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచారంటూ నిర్మాత మోహన్‌బాబు, హీరో మంచు విష్ణుపై కేసు నమోదైంది. సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ కొత్తపేటకు చెందిన రఘునందనరావు రంగారెడ్డిజిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు ఆదేశాలతో చైతన్యపురి పోలీసులు హీరోవిష్ణు, మోహన్ బాబు, హీరోయిన్ హన్సిక, బ్రహ్మనందం, ఏవీఎస్, సెన్సార్‌బోర్డు సభ్యులు, నిర్మాత, డెరైక్టర్లతోపాటు మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు. సెన్సార్ బోర్డు అధికారులను వివరణ కోరుతూ లేఖ రాశామన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: